తెలుగు రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ పకడ్బందీగా అమలు చేస్తోంది. ఇద్దరు ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాలకు చెందిన ప్రజలను ఎవరు కూడా బయటకు రాకుండా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తున్నారు. దీంతో లాక్ డౌన్ వలన కొంతమంది మనుషులు చాలా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ పరంగా కూడా తెలుగు రాష్ట్రాలలో కొన్ని కోట్ల రూపాయలు నష్టం కూడా వస్తుంది. ముఖ్యంగా విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే కేవలం రెవిన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే డబ్బు పైన ప్రభుత్వ యంత్రాంగం నడుస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆదాయం ఆంధ్రప్రదేశ్ లేకపోవటంతో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోయే ప్రమాదం రానున్న రోజుల్లో పొంచి వున్నట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

 

 

అంతేకాకుండా గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో పూర్తిగా కూరుకుపోయేటట్లు చేయటంతో ఉన్న అవకాశాలతో నిధులతో వైయస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది. దీంతో కరోనా వైరస్ తో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఏపీలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో పూర్తిగా ఏపీ ఆర్థిక పరిస్థితి ప్రమాదంలో పడే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోపక్క వచ్చే జూన్ నెల లోపు పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని జగన్ ప్రభుత్వం అనేక టార్గెట్లు ఇలాంటివి పెట్టుకోవడం జరిగింది.

 

 

దీంతో కరోనా వైరస్ దెబ్బతో అది సాధ్యం కాకపోవచ్చు అని ఆర్థిక నిపుణులు తెలియజేస్తున్నారు. ఒకవేళ ప్రస్తుతం ఉన్న లాక్ డౌన్ పిరియడ్ ఇంకా కొనసాగితే మాత్రం జరిగేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో బీహార్ రాష్ట్రంగా మారటం గ్యారెంటీ అని చాలామంది అంటున్నారు. ఒకవేళ లాక్ డౌన్ పెరగకుండా ఉంటే రాబోయే రోజుల్లో ధరలు ఆకాశాన్ని అంటుతాయి అని అంటున్నారు. కచ్చితంగా కరోనా వైరస్ ఎఫెక్ట్ జగన్ కి కత్తి మీద సాము లాంటిది అయ్యింది అని ఆర్థిక నిపుణులు అంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: