కరోనా వైరస్ గాలిద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని ఇటీవల సోషల్ మీడియా లో కొంతమంది ప్రబుద్ధులు ప్రచారం చేస్తున్నారు . దీనితో ప్రజల్లో తీవ్ర  ఆందోళన మొదలయింది . సోషల్ మీడియా లో  ఒక యువతి  తనని తాను ప్రపంచ ఆరోగ్య సంస్థ   (డబ్య్లు హెచ్ ఓ ) అనుబంధ సభ్యురాలిగా పేర్కొంటూ ,  గాలిలో కూడా కరోనా వైరస్  సోకుతుందని  తనకు ఈ మేరకు  డబ్య్లు హెచ్ ఓ నుంచి వాట్సాప్ సందేశం వచ్చినట్లు వాయిస్  సందేశాన్ని వైరల్ చేసింది . ఈ సందేశాన్ని విన్న వారు గతకొన్ని రోజులుగా, గాలిద్వారా కరోనా సోకే ప్రమాదముందని కనీసం ఇళ్ల డాబాలపైకి వెళ్లేందుకు కూడా  జంకుతున్నారు .

 

చైనాలోనూ వూహన్ సిటీ లో పురుడు పోసుకున్న కరోనా వైరస్ , ఒక్కొక్క దేశానికి విస్తరిస్తూ , ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 199 దేశాల ప్రజలను గడగడలాడిస్తోంది . అయితే కరోనా ఒకరి ద్వారా మరొకరి సోకుతుందే తప్పా ... గాలి ద్వారా సోకే అవకాశం లేదని డబ్య్లు హెచ్ ఓ ఒక ప్రకటన లో  స్పష్టం చేసింది . కరోనా బాధితుడితో  సన్నిహితంగా మెలిగినప్పుడు , అతను తాకిన వస్తువులను తాకినప్పుడు మాత్రమే కరోనా వైరస్ సోకుతుందని డబ్య్లు హెచ్ ఓ అధికారులు  తెలిపారు  .  

 

 ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికి  ఏడు లక్షల మందికి  కరోనా వైరస్ సోకగా , 33 వేలమంది మృత్యువాత పడ్డారు . దేశం లో దాదాపు వెయ్యి మందిపైగా కరోనా బారిన పడగా, 29 మంది మృతి చెందారు . తెలంగాణ లో 70 మంది పైగా కరోనా బాధితులు కాగా, ఒక వృద్ధుడు మృతి చెందాడు . ఆంధ్ర ప్రదేశ్ లోను  పలువురు కరోనా వ్యాధి బారినపడ్డారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: