ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ చూసినా కరోనా... ఎవరి నోట విన్నా కరోనా... ఏం చేసినా కరోనా... ఏం చేయ వద్దు అనుకున్న కరోనా.. పడుకున్న కరోనా... నిలబడిన కరోనా... ఏం చేసినా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న మాట కరోనా వైరస్. చైనాలో గుర్తించబడిన ఈ మహమ్మారి వైరస్... ప్రస్తుతం ప్రపంచ దేశాలను చిగురుటాకులా వణికిస్తూ.. ఎంతోమంది ప్రాణాలు పొట్టన పెట్టుకుంది. ఇంకెంతో మందిని  మృత్యువుతో పోరాడేలా  చేస్తుంది. ఖండాలు దాటి కోరలు చాస్తూ  ప్రపంచాన్ని వణికించేస్తుంది ఈ మహమ్మారి ప్రాణాంతకమైన వైరస్. ఇలా రోజురోజుకు విజృంభిస్తూ.. ప్రజలందరూ ప్రాణభయంతో బతికేలా చేస్తోంది. 

 

 

 ముఖ్యంగా చైనా తర్వాత అమెరికా ఐరోపా ఖండం కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న విషయం తెలిసిందే. అక్కడి ప్రజలందరినీ కేవలం ఇంటికి మాత్రమే పరిమితం చేస్తూ ప్రభుత్వం కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చినప్పటికీ పరిస్థితి మాత్రం అదుపులోకి రావడం లేదు. జపాన్ లో  పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉన్నప్పటికీ రానున్న రోజులను తలచుకుంటే మాత్రం ఆందోళన చెందక తప్పడం లేదు. అయితే క్షేత్రస్థాయిలో జపాన్ ప్రభుత్వం అక్కడి పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తోంది. ఇక ఈ మధ్య కాలంలో జపాన్ దేశంలో కరోనా  వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో... అక్కడి ప్రభుత్వానికి ప్రజలకు ఆందోళన మొదలైంది. 

 

 

 జపాన్ దేశంలో ఈ మహమ్మారి బారిన పడిన ఏకంగా అక్కడ ఒక ప్రముఖ కమెడియన్ ప్రాణాలు పోగొట్టుకోవడం ప్రజల్లో  మరింత భయాందోళనకు కారణమయ్యింది. ఈ నేపథ్యంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు జపాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు  అనే సమాచారం.జపాన్ దేశంలో పరిస్థితి చేయి దాటి పోకముందే... ఎమర్జెన్సీ డిక్రి  ద్వారా దేశ ప్రజలందరి ఇంటికి మాత్రమే పరిమితం చేసి.. కరోనా  వైరస్ ను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని జపాన్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. కఠిన ఆంక్షలకు తెర లేపాలనే  డిమాండ్ కూడా రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. ఇక తాజాగా జపాన్ మెడికల్ అసోసియేషన్ కు చెందిన ఓ ప్రముఖ వైద్యులు కూడా ఇలాంటి సూచనలు చేశారు. పరిస్థితి చేయి దాటి పోకముందే దేశంలో ఎమర్జెన్సీని విధించి  కరోనా వైరస్ ని తరిమి కొట్టాలంటూ  అభిప్రాయం వ్యక్తం చేశారు. లేకపోతే దేశంలో పరిస్థితి అదుపు తప్పుతుంది అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: