దేశంలో రోజురోజుకు కరోనా  వైరస్ విజృంబిస్తున్న  విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా  వైరస్ ని తరిమి కొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పోరాటానికి సిద్ధం అయింది. ఈ పోరాటంలో అందరూ భాగస్వామ్యం కావాలంటూ  పిలుపునిస్తోంది. అయితే కరోనా వైరస్ పై పోరాటం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు భారీ మొత్తంలో ఎంతో మంది ప్రముఖులు విరాళాలు అందజేస్తున్న విషయం తెలిసిందే . ఇక తాజాగా భారత్లో కరోనా వైరస్ ను తరిమి కొట్టేందుకు పోరుకు సిద్దమైన కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలవాలని దిగ్గజ వ్యాపార సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నిర్ణయించారు. 

 

 

 పీఎం కేర్స్  సహాయనిధికి రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ విరాళాన్ని  ప్రకటించింది. కరోనా  వైరస్ ను  తరిమికొట్టేందుకు పోరుకు సిద్దమై ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలుస్తూ పి.ఎం.కేర్స్  సహాయనిధికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏకంగా 500 కోట్ల విరాళం అందజేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటన విడుదల చేసింది. అంతేకాకుండా కరోనా  వైరస్ ను నియంత్రించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్న గుజరాత్,మహారాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అండగా నిలిచింది రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ. 

 

 

 గుజరాత్, మహారాష్ట్ర ప్రభుత్వాలకు చెరో 5 కోట్లు ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. భారతదేశంలో కరోనా వైరస్ ని తరిమి కొట్టేందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాలకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుంది అంటూ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తెలిపారు. ముఖేష్ అంబానీ మాత్రమే కాకుండా ఎంతో మంది సంపన్నులు పీఎం  కేర్ సహాయ నిధికి వందల కోట్లు విరాళంగా అందజేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆదానీ గ్రూప్ 100 కోట్లు, టాటా గ్రూప్ హోల్డింగ్ సంస్థ వెయ్యి కోట్లు, టాటా ట్రస్ట్ 500 కోట్లు విరాళాలను  అందజేశారు. భారత్లో రోజురోజుకు కరోనా  వైరస్ కేసులు పెరిగిపోతున్న తరుణంలో ప్రస్తుతం భారత ప్రజలందరూ కరోనా  వైరస్ కట్టడి  కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను గౌరవిస్తూ స్వచ్ఛందంగా పోరాటం కొనసాగిస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: