దేశం మొత్తం కరోనా వైరస్ వల్ల  అల్లకల్లోలంలా మారిపోయింది. ఎంతో మంది ప్రాణాలు బలితీసుకుంది ఈ మహమ్మారి. ఇప్పటికి ఎంతో మంది ఈ వైరస్ బారిన పడ్డారు. అయితే  నరేంద్ర మోడీ గారు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు అందరు ఇళ్లకే పరిమితం అయ్యారు. దీనితో దేశం మొత్తం నిత్య అవసరాలకు చాలా ఇబ్బందులు పడుతున్నారు.

 

చాలా మంది ఉపాధి కోల్పాయారు. అందుకే కరోనా వైరస్‌పై దేశం జరిపే పోరులో సాయపడాలని ప్రధాని నరేంద్ర మోదీ  ప్రజలకు  పిలుపు  ఇచ్చారు. "పీఎం కేర్స్‌ ఫండ్‌" కి ఎవరికీ తోచిన సహాయం చేయాలనీ కోరారు. సహాయం  నిమిత్తం  మన   రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా నడుం బిగించింది.తనవంతు  సహాయం కింద భారీ మొత్తాన్ని ప్రకటించి మానవత్వాన్ని చాటుకుంది.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలకు తోడు తాము ముందు ఉంటామని నిరూపించుకుంది.

 

అయితే సోమవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) పీఎం-కేర్స్ ఫండ్‌కు రూ .500 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు తెలిపింది. అలాగే  కోవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న  మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు అదనంగా 5 కోట్ల రూపాయలు  సమకూర్చుతున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటి వరకూ కరోనా కట్టడికి రిలయన్స్ చాలా కార్యక్రమాలు   చేసింది.   భారతదేశపు మొట్టమొదటి 100 పడకల ప్రత్యేకమైన COVID-19 హాస్పిటల్ కరోనావైరస్ రోగుల చికిత్సకు కేవలం రెండు వారాల్లో సిద్ధం అయిందని తెలిపింది. వైద్య సిబ్బంది రక్షణ కోసం పీపీఈ ప్రొటెక్టివ్స్‌ గేర్స్‌ను పంపిణీ చేస్తామని వెల్లడించింది.

 

అలాగే  పది రోజుల్లో దేశవ్యాప్తంగా 50 లక్షల మంది పేదలకు భోజనం సరఫరా చేస్తామని, ప్రతిరోజూ లక్ష మాస్క్‌లను వైద్య సిబ్బంది, ఆరోగ్య సంరక్షకులకు సరఫరా చేస్తామని తెలిపింది. ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ వాహనాలకు దేశవ్యాప్తంగా ఉచిత ఇంధనాన్ని సమకూరుస్తామని పేర్కొంది.జియో తన టెలికాం ద్వారా రోజూ దాదాపు 40 కోట్ల మంది వ్యక్తులు అలాగే వేలాది సంస్థలను ‘ఇంటి నుండి పని’, ‘ఇంటి నుండి అధ్యయనం’, ‘ఇంటి నుండి ఆరోగ్యం’అలాంటి సజావుగా సాగె మార్గాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపింది. 

 

తమ సంస్థలో పనిచేసే ఒప్పంద, తాత్కాలిక ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తామని రిలయన్స్ స్పష్టం చేసింది. మన భారత దేశం కష్టాల్లో ఉంటే ఆదుకునే భాద్యత ప్రతి ఒక్క భారతీయుడిదని నిరూపించారు రిలయన్స్ ఇండస్ట్రీస్.

మరింత సమాచారం తెలుసుకోండి: