ఉత్తరప్రదేశ్ లోని   బరేలి జిల్లా అధికారుల వ్యవహారశైలి పై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి . కరోనా కట్టడికి ప్రభుత్వాలు తీసుకుంటున్న  చర్యలను ప్రతీ ఒక్కరూ స్వాగతిస్తున్నారు .  కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్ డౌన్ నిబంధనలను నూటికి 99 శాతం మంది పాటిస్తూ , కరోనా విస్తృతిని అడ్డుకునేందుకు తమ వంతు సహాయ , సహకారాన్ని అందజేస్తున్నారు .

 

అయితే కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఇప్పటి వరకూ కొన్ని చోట్ల పోలీసులు అతిగా వ్యవహరించి విమర్శలను ఎదుర్కొంటుండగా , తాజాగా వలస కూలీల పట్ల  బరేలి జిల్లా అధికారులు , శానిటైజేషన్ సిబ్బంది వ్యవహరించిన తీరు మానవత్వాన్ని మంటకలిపేదిగా ఉందన్న విమర్శలు విన్పిస్తున్నాయి . కరోనా కట్టడి లో భాగంగా రసాయనాలు కలిపిన మిశ్రమాన్ని దేశంలోని ప్రధాన నగరాల్లో రోడ్లపై పిచికారి చేస్తున్నారు . అయితే ఢిల్లీ నుంచి ఉత్తర ప్రదేశ్ లోని  బరేలి కి వచ్చిన వలసకూలీలను ఒక చోట కూర్చోబెట్టి,  శానిటేషన్ సిబ్బంది ఆ మిశ్రమాన్ని  స్ప్రే చేశారు .

 

 పెద్దల్ని , పిల్లల్ని కళ్ళు మూసుకొమ్మని చెప్పిన శానిటేషన్ సిబ్బంది వారిపై రసాయన మిశ్రమాన్ని స్ప్రే చేయడం తో కళ్ళ మంటతో వలస కూలీలు , వారి పిల్లలు బాధపడ్డారు . రోడ్ల పై స్ప్రే చేసే మిశ్రమాన్ని వలస కూలీలు , వారి పిల్లలపై స్ప్రే చేయడం ఏమిటంటూ రాజకీయ పార్టీలు , సోషల్ మీడియా వేదిక నెటిజన్లు చేస్తోన్న ట్రోల్స్ తో అధికారులు అప్రమత్తమయ్యారు . అందరి మంచి కోసమే వారిపై రసాయన మిశ్రమాన్ని స్ప్రే చేసినట్లు చెప్పుకొచ్చారు . మానవత్వాన్ని మర్చి అధికారులు చేసిన పని పట్ల వెల్లువెత్తుతోన్న   విమర్శలతో  ఉత్తర ప్రదేశ్ యోగి ప్రభుత్వం ఇకారటం లో పడింది .     

మరింత సమాచారం తెలుసుకోండి: