ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఒకటే భయం.. అదే కరోనా వైరస్ భయం.. సెలబ్రిటీల దగ్గర నుంచి సామాన్యుల వరకు... సంపన్నుల నుంచి నిరుపేదల వరకు అందరిలో భయం భయం. కనిపించని శత్రువు  తమపై ఎక్కడ దాడి చేస్తుందని అందరూ ప్రాణభయం ఉన్న ప్రశ్నార్ధక జీవితాన్ని గడుపుతున్నారు. కరోనా  వైరస్ భూతం ప్రస్తుతం ప్రపంచాన్ని మొత్తం వణికిస్తోంది ... ఎంతో మందిని పొట్టన పెట్టుకుంటోంది. రోజురోజుకు మరణ మృదంగం మోగిస్తూ... ఎంతో మంది ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటుంది ఈ మహమ్మారి వైరస్. 

 

 

 రోజురోజుకు కోరలు చాస్తున్న కరోనా  వైరస్ భయంతో ప్రపంచం వనికి పోతుంది. కనిపించని శత్రువుతో పోరాటం చేస్తుంది ప్రస్తుతం ప్రపంచం. అయితే సామాన్య లనే కాదు ప్రముఖులను కూడా ఈ వైరస్ వదిలిపెట్టడం లేదు. ధనిక పేద అనే తారతమ్యం లేకుండా.. ప్రముఖులు సామాన్యులు అనే తేడా లేకుండా అందరికీ మృత్యుఒడిలోకి పంపిస్తుంది ఈ మహమ్మారి. ఇప్పటికే చాలా మంది సినీ రాజకీయ ప్రముఖులు కూడా కరోనా  వైరస్ పాజిటివ్ ఉన్నట్లు తేలిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్  , బ్రిటన్  ఆరోగ్యశాఖ మంత్రి మాట్  హాంకాంగ్, కెనెడ  ప్రధాని జస్టిన్ ట్రూడో  అర్ధాంగి కరోనా  బాధితులు అయ్యారు. స్పెయిన్ యువరాణి అయితే ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు సైతం కోల్పోయింది. 

 

 

 అయితే కరోనా  వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వ్యక్తిగత సహాయకుడిగా పని చేస్తున్న ఓ వ్యక్తి కి కరోనా  కలిగి ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ముందు జాగ్రత్త చర్యగా ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు  క్వారంటైన్  లోకి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన గత వారం రోజుల కింద వరకు పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యారు. అయితే ఇజ్రాయిల్ ప్రధాని పీఏ కరోనా  వైరస్తో బాధపడుతున్నట్టు గుర్తించడంతో.... కేవలం ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు  మాత్రమే కాకుండా ఇతర సహాయక సిబ్బంది కూడా సెల్ఫ్ క్వారంటైన్  లో కి వెళ్లేందుకు  నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇక వీరందరికీ ఇప్పటికే కరోనా  వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: