కరోనా కట్టడి కోసం ఏపీ సర్కారు తగిన చర్యలు తీసుకుంటోంది. దేశంలోని చాలా రాష్ట్రాల కన్న మెరుగ్గా ఏపీలో కరోనా వైరస్ వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే లాక్‌ డౌన్ ప్రభావం ప్రజలపై తీవ్రగానే పడుతోంది. ముఖ్యంగా నిరుపేదలు, కూలీలు పరిస్థితి దారుణంగా ఉంది. అందుకే ఏపీ సర్కారు ఒక నెల రేషన్ ను ముందుగానే అందజేసింది.

కరోనా వ్యాప్తి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అధికారులతో సమీక్షలు నిర్వహించిన జగన్.. వారికి ఒకటే మాట చెబుతున్నారు.

 

రాష్ట్రంలో ఏ ఒక్కరూ పస్తుతో ఉండ కూడదని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దాదాపు 5వేల మంది రాష్ట్రంలోని వివిధ సెంటర్లలో ఉన్నారు. వారందరికి ఆహారంతో పాటు సరైన సదుపాయలు కల్పించాలని, ఏ ఒక్కరూ పస్తుతో పడుకున్నారనే మాట రాకూడదని జగన్ సూచించారు. ఈ విషయంలో కలెక్టర్లు పూర్తి బాధ్యత వహించాలని జగన్ ఆదేశించారు.

 

 

కరోనావైరస్‌ నివారణ చర్యలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఆర్డీఓలు, ఎస్పీలతో సోమవారం సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. కరోనా షెల్టర్లలో ఉన్నవారిని మానవతా దృక్పథంతో చూసుకోవాలని.. ఈ విషయంలో పది రూపాయల ఖర్చు ఎక్కువైనా పర్వాలేదని అధికారులకు సూచించారు. షెల్టర్లలో ఉన్నవారిని జాగ్రత్తగా చూసుకోవాలని... రోజూ ఒకే ఆహారాన్ని కాక మెనూను మార్చి ఇవ్వాలని సూచించారు.

 

 

ఇక కరోనా సాకుతో ధరలు పెంచే వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని జగన్ సూచించారు. నిత్యావసరాల వస్తువలను అధిక ధరలకు విక్రయిస్తే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రకటించిన ధరల కంటే ఎక్కువ ధరకు అమ్మితే జైలుకు పంపేందుకు కూడా వెనుకాడబోమని.. ఈ విషయం వ్యాపారులకు చెప్పాలని జగన్ ఆదేశించారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: