కరోనా అనే వైరస్ ప్రపంచాన్ని ఎంత  భయపెడుతుందో అందరికీ తెలుసు. అన్ని దేశాలు ఈ కరోనా ప్రభావానికి గురైన దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో తీవ్ర స్థాయిలో లేకపోయినా, తెలంగాణలోనూ కేసులు నమోదవుతున్నాయి. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ ప్రభుత్వం గట్టి చర్యలే తీసుకుంటోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఇప్పటిలాగే సమర్థవంతంగా లాక్ డౌన్ అమలు అయితే ఏప్రిల్ ఏడో తేదీ నాటికి తెలంగాణలో పూర్తిస్థాయిలో అదుపులోకి వస్తుందని, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ లో చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకుంటే కాస్త ఊరట కలిగించే విధంగా కనిపిస్తోంది. ఇదంతా సాధ్యం అవుతుంది అని చెబుతున్నారు. కానీ ప్రజలు మాత్రం దీని గురించి పెద్దగా పట్టించుకొన్నట్టుగా కనిపిస్తున్నారు. కూరగాయలు, నిత్యావసరాలు పేరుతో జనమంతా రోడ్లపైకి గుంపులు గుంపులుగా ఒక్కసారిగా చేరుకుంటున్నారు.

 

IHG

 ముఖానికి మాస్క్, చేతులకు గ్లోజులు ధరించి సామాజిక దూరం పాటించాలంటూ ప్రభుత్వం మొత్తుకుంటున్నా చాలా మంది ప్రజలు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. అసలు ఆ వైరస్ విషయాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు. ప్రభుత్వం నిబంధనలు సడలించిన సమయంలో జనాలు గుంపులు గుంపులుగా ఓకే బైక్ పై ముగ్గురు ముగ్గురు చొప్పున ప్రయాణిస్తూ వీధుల వెంట వీర విహారం చేస్తున్నారు. ప్రతిరోజు తెరిచి ఉంచే మెడికల్ షాపులు, నిత్యావసరాలు అమ్మే దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం హెచ్చరికలు చేస్తూ, ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నా, జనాలు మాత్రం అవి ఏవీ పాటించేందుకు సిద్ధంగా ఉండడం లేదు. ఈ వైరస్ పై ప్రజల్లో అవగాహన ఉన్నా వారంతా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

 

IHG

 ప్రతి ఒక్కరికి క్షేత్రస్థాయిలో ప్రభుత్వాలు వచ్చి చెప్పలేదు, అలాగే ప్రతి ఒక్కరిని క్రమశిక్షణలో పెట్టలేదు. పరిస్థితిని బట్టి ప్రజలు క్రమశిక్షణతో మెలగాలి. ఒకరికి వచ్చిన వైరస్ ద్వారా వేలాదిమందికి అంతుకుతుందనే సామాజిక స్పృహ కూడా ప్రజల్లో ఉండాలి. మొత్తం ప్రభుత్వాలే అన్ని పనులు చేయాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. రాష్ట్రం నుంచి, దేశం నుంచి తరిమి కొట్టాలంటే ఖచ్చితంగా సామాజిక దూరం పాటిస్తూ ప్రభుత్వం విధించిన విజయవంతం చేస్తేనే మన దేశం నుంచి కరోనా వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. లేకపోతే మిగతా దేశాల్లో వీర విహారం చేసినట్లు మన దేశంలోనూ విజృంభించే అవకాశం లేకపోలేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: