కరోనా వైరస్ ప్రళయతాండవం చేస్తూండడంతో ప్రపంచమంతా వణికిపోతోంది. భారత్ లో పరిస్థితులు చేయి దాటకుండా కేంద్ర ప్రభుత్వం యావద్ భారతావనికి లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమైపోయారు. వేరే ఊళ్లలో, జిల్లాల్లో, రాష్ట్రాల్లో, దేశాల్లో ఉండిపోయిన వారు కూడా సొంత ప్రదేశాలకు రాలేక ఎక్కడికక్కడే ఉండిపోయారు. ఇలా చిక్కుకున్న వారిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారులు కూడా ఉన్నారు. చెన్నై తీరంలో చిక్కుకుపోయిన వారి గురించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమిళనాడు సీఎంకు ట్విట్టర్ ద్వారా పరిస్థితి వివరించి వారిని ఆదుకోవాలని కోరాడు.

 

 

పవన్ అభ్యర్ధనకు తమిళనాడు సీఎం పళనిస్వామి స్పందించి వారిని ఆదుకుంటామని పవన్ కు రిప్లై ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు చెన్నై కార్పొరేషన్ అధికారులు మత్స్యకారులకు అవసరమైన ఆహారాన్ని అందించారు. దీంతో పవన్ స్పందించిన తీరుకు సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. కోరిందే తడవుగా స్పందించిన తమిళనాడు సీఎం పళనిస్వామికి పవన్ కృతజ్ఞతలు తెలిపారు. చెన్నై కార్పొరేషన్ అధికారులకు కూడా పవన్ కృతజ్ఞతలు తెలిపారు. తమిళ సినీ వర్గాల్లో కూడా ఈ అంశం హైలైట్ అయింది. తమిళ హీరో మాధవన్ సైతం పవన్ తీరును మెచ్చుకుంటూ ట్వీట్ చేశాడు.

 

 

మత్స్యకారులు చిక్కుకుపోయిన ఘటనను తన దృష్టికి తీసుకొచ్చిన జనసైనికులకు పవన్ కృతజ్ఞతలు తెలిపాడు. ‘సోంపేట మండలం, సిహెచ్.గొలగండి గ్రామం - మత్స్యకారులు, లాక్ డౌన్ వలన, చెన్నై తీరా ప్రాంతంలో చిక్కుకు పోయిన సమస్యని, పార్టీ దృష్టికి తీసికొచ్చినందుకు, మత్స్య కార్మికుల కుటుంబాలకు అండగా నిలబడినందుకు, ఇచ్ఛాపురం జనసేన నాయకులు.. ’శ్రీ దాసరి రాజు గారిని‘ మనస్పూర్తిగా అభినందిస్తున్నాను’ అంటూ పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ వార్త రాష్ట్ర రాజకీయాల్లో కూడా సంచలనమైంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

https://tinyurl.com/NIHWNgoogle

 

https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: