తక్కువ జనాభా కలిగిన యూరోపియన్ దేశాలు కరోనా మహమ్మారికి విలవిలలాడిపోతున్న సంగతి తెలిసిందే. రోజుకి లెక్కకు మించిన మరణాలతో పిచ్చివాళ్ళైపోతున్నారు. మొన్నటి వరకు రోజులో అత్యధిక మరణాలు ఇటలీలో నమోదవగా గత రెండు రోజుల నుండి అమెరికాలో ఎక్కువగా నమోదవుతూ హడలిస్తున్నాయి. అయితే 130 కోట్ల అత్యధిక జనాభా కలిగిన భారతదేశం ఎదిరించి నిలబడుతుండడంపై ప్రపంచ అగ్ర దేశాలు ఆశ్చర్యానికి గురౌతున్నాయి.  

 

భారత్ లాంటి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో "లాక్ డౌన్" వంటి ప్రక్రియ విజయవంతం కాదని, భారతీయులు సహకరించరని ఐక్యరాజ్యసమితి తో పాటు డబ్లూహెచ్ఓ వంటి సంస్థలు అంచనా వేసాయి. కాని ఆ అంచనాలను మన భారత దేశం తలకిందులు చేసింది. రోజు రోజుకి భద్రత విషయంలో ప్రధాని తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు, చర్యలు, ప్రజలకి స్పూర్తి కలిగించే కార్యక్రమాలు, కరోనా బారిన పడ్డ వారికి తీసుకుంటుంన్న నివారణ చర్యలు చూసి అన్ని దేశాలు నివ్వెర పోతున్నాయి. ఇదేలా సాధ్యమవుతోందని అవాక్కవుతున్నారు.   

 

ఈ విషయంలో కొంతమంది అంతర్జాతీయ ఎనలిస్టులైతే ఈ మహమ్మరి దెబ్బకు మురికివాడలు ఎక్కువగా ఉన్న భారత్ లో రానున్న రోజులలో ఎంతమంది చనిపోతారో లెక్కలు కూడా కట్టేశారు. కానీ వీళ్ళందరి అంచనాలు తప్పని నిరూపించడానికి భారత్ లో లాక్ డౌన్ ఖచ్చితంగా, కఠినంగా అమలు చేసి కరోనాని అడ్డుకుంటున్న విధానానికి ఇతర దేశాలు ఆశ్చర్యపోతున్నాయి.   

 

ఈ లాక్ డౌన్ ని ఒక యజ్ఞం లా 100% అత్యంత కఠినంగా ఏప్రిల్ 14 వరకూ కొనసాగిస్తే ఈ మహమ్మరి నుండి భారత్ బయటపడం అంత పెద్ద కష్టమేమీ కాదని వైద్యనిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు మన భారతీయులకు శుచి తక్కువని, శుభ్రత ఉండదని అసహ్యించుకుని ద్వేషించే విదేశీయులే ఇప్పుడు సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత లను తూ.చ తప్పకుండా పాటిస్తున్న భారతీయులను చూసి సిగ్గుపడుతున్నాయట. దీన్ని బట్టి మనం, మన భారత దేశం ప్రపంచ దేశాలకి ఆదర్శం అవుతోందని మరోసారి నిరూపితం అయింది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. 
క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

https://tinyurl.com/NIHWNgoogle

 

https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: