క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌ర‌ణ మృదంగం మోగిస్తోంది. దిమ్మ‌తిరిగిపోయేలా మ‌ర‌ణాలు న‌మోదు అవుతున్నాయి. రెండు నెల‌ల్లో 4 వేల మంది చ‌నిపోతే కేవ‌లం మార్చి నెల‌లోనే 33 వేల మంది చ‌నిపోయారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా మంగ‌ళ‌వారంతో చూస్తే క‌రోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 8 ల‌క్ష‌ల‌కు చేరువ అవుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు చ‌నిపోయిన వారు 38 వేల‌కు చేరువ అవుతున్నారు. ఇక క‌రోనాతో ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న వారు 1.65 ల‌క్ష‌ల‌కు చేరువ అవుతున్నారు. అమెరికాలో క‌రోనా బాధితులు 1.63 ల‌క్ష‌లు ఉన్నారు.

 

ఇట‌లీలో క‌రోనా పాజిటివ్ బాధితులు 12 వేల మంది ఉన్నారు. స్పెయిన్‌లో మృతులు 7700కు చేరువ అవుతున్నారు. చైనాలో క‌రోనా చాలా వ‌ర‌కు కంట్ర‌ల్లోకి వ‌చ్చేయ‌గా యూర‌ప్ అగ్ర రాజ్యాలు అయితే విల‌విల్లాడుతున్నాయి. అటు అమెరికా ప‌రిస్థితి కూడా అలాగే ఉంది. ఇక మ‌న దేశంలో ఇప్ప‌టి వ‌ర‌క క‌రోనా మ‌ర‌ణాలు 36కు చేరుకున్నాయి. తెలంగాణ‌లోనే ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా సోకి 6 గురు మృతి చెందిన‌ట్టు ప్ర‌భుత్వం అధికారికంగా ప్ర‌క‌టించింది.

 

ఇక మ‌న దేశంలో మ‌హారాష్ట్ర‌, కేర‌ళ‌, రాజ‌స్తాన్‌, తెలంగాణ రాష్ట్రాల్లోనే ఎక్కువుగా క‌రోనా కోర‌లు చాస్తోంది. ఇక వ‌చ్చే వారం ప‌ది రోజుల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌రిన్ని భ‌యంక‌ర‌మైన ప‌రిస్థితులు చోటు చేసుకోనున్నాయి. వీటిని త‌ల‌చుకుంటేనే ఎంత భ‌యంక‌ర‌మో అర్థ‌కావ‌డం లేదు. 

 

క్వారంటైన్లో ఉన్న వారు - 30 + వేలు

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: