ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా దెబ్బ‌తో అస‌లు ఈ భూ ప్ర‌పంచం మీద మాన‌వ మ‌నుగ‌డ కొన‌సాగుతుందా ? అన్న సందేహాల‌ను కూడా కొంద‌రు వ్య‌క్తం చేస్తున్నారంటే ప‌రిస్థితి ఎంత భ‌యంకరంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. అస‌లు కరోనా కంటే ప్రజల్లో భయాందోళనలే పెద్ద సమస్యగా మారాయని చెప్ప‌వ‌చ్చు. ఎవ‌రికి వారు ధైర్యంగా క‌రోనాపై పోరాటం చేయాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను గుర్తించ‌కుండా లేనిపోని ఆందోళ‌న‌ల‌తో మ‌రి కొంత మంది భ‌యానికి కార‌ణ‌మ‌వుతున్నారు.

 

ఇక మంగ‌ళ‌వారం ఉద‌యం అప్‌డేట్స్ ప్ర‌కారం చూస్తే ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసులసంఖ్య 7,84, 381 కేసులు ఉన్నాయి. వీరిలో ఇప్ప‌టికే 37, 780 మంది మృతి చెందారు. ఇక మ‌ర‌ణాల ప‌రంగా ప్ర‌పంచ వ్యాప్తంగా చూస్తే అమెరికా , ఇట‌లీ, స్పెయిన్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. విచిత్రం ఏంటంటే ఏ చైనాలో అయితే ఈ వైర‌స్ పుట్టిందో ఇప్పుడు ఆ చైనాను ఈ మూడు దేశాలు క్రాస్ చేసేశాయి. చైనా క్ర‌మ‌క్ర‌మంగా సేఫ్‌జోన్‌లోకి వెళ్లిపోయింది. 

 

టాప్ మూడు స్థానాల్లో ఉన్న కేసుల‌ను చూస్తే అమెరికాలో 1,63, 479 పాజిటివ్ కేసులు న‌మోదు అవ్వ‌గా... కొత్త కేసులు 19, 988 ఉన్నాయి. అక్క‌డ మ‌ర‌ణాల సంఖ్య 3,148 ఉన్నాయి. ఇక రెండో స్థానంలో ఉన్న ఇట‌లీలో చూస్తే 1,01, 739 కేసులు ఉంటే 4 వేల కొత్త కేసులు 11, 591 మ‌ర‌ణాలు ఉన్నాయి. ఇక స్పెయిన్‌లో 87, 956 కేసులు ఉన్నాయి. 7846 కొత్త కేసులు 7716 మ‌ర‌ణాలు న‌మోదు అయ్యాయి. చైనాలో 81,470 కేసులు ఉండ‌గా... 31 కొత్త కేసులు 3304 మ‌ర‌ణాలు న‌మోదు అయ్యాయి. ఏదేమైనా చైనా మాత్రం తాను సేఫ్ అయ్యి ప్ర‌పంచాన్ని ప్ర‌మాదంలో ప‌డేసింది.

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: