ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తగ్గినట్టే తగ్గి ప్రభావం చూపిస్తుంది. కరోనా ప్రభావం గురించి తక్కువ అంచనా వేసిన దేశాలు సహా కొన్ని రాష్ట్రాలు ఇప్పుడు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఇప్పుడు దాదాపుగా కరోనా కోరలలో చిక్కుకున్నాయి. కరోనా నుంచి బయటకు రావడం ఎలాగో అభివృద్ధి చెందిన దేశాలకు ఎంత మాత్రం అర్ధం కాని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. 

 

కరోనా వైరస్ ఇప్పుడు ఇటలీలో అక్కడి ప్రజలకు భవిష్యత్తు మీద ఆశలను చంపేసింది. ఇటలీలో కరోనా బారిన పడి 11 వేల మంది ప్రాణాలు కోల్పోగా మరో 10 వేల మంది మరణానికి దగ్గరలో ఉన్నారు. వృద్దులు ఎక్కువగా ఉన్న దేశం అది. ఇక బాధితుల సంఖ్య విషయానికి వస్తే లక్షకు పైగానే ఉంది. ఇక స్పెయిన్ విషయానికి వస్తే 90 వేలకు చేరువలో కరోనా బాధితులు ఉన్నారు. అక్కడ 8 వేలకు చేరువలో మరణాలు ఉన్నాయి. 

 

నిన్న ఒక్క రోజే దాదాపు వెయ్యి మందికి పైగా కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య ఇప్పుడు లక్షా 70 వేలకు చేరువలో ఉంది. అక్కడ ఇప్పట్లో కరోనా వైరస్ కంట్రోల్ అయ్యే అవకాశాలు కనపడటం లేదు. ఇప్పుడు కరోనాను కట్టడి చేయడం అనేది ప్రపంచ దేశాలకు ఒక సవాల్ అని అంటున్నారు. మన దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1300కి దగ్గరలో ఉంది. తెలంగాణాలో 72 మంది ఆంధ్రప్రదేశ్ 23 మంది కరోనా బారిన పడ్డారు. ఆదివారం తగ్గినట్టే తగ్గిన కరోనా ఉన్నపళంగా పెరిగిపోయింది.

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: