క‌రోనా దెబ్బ‌తో నిన్న‌టి వ‌ర‌కు డేంజ‌ర్ జోన్‌లో ఉన్న అమెరికా, ఇట‌లీల‌కు తోడు ఇప్పుడు యూర‌ప్లోని స్పెయిన్ కూడా వ‌చ్చి చేరిపోయింది. స్పెయిన్‌లో క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు తీసుకుంటోన్న చ‌ర్య‌లు కూడా విఫ‌ల‌మ‌వుతుండ‌డంతో ప్ర‌భుత్వం చేతులు ఎత్తేస్తోంది. ప్ర‌జ‌లు ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా.. పోలీసులు అక్క‌డ క‌ఠినంగా ప్ర‌వ‌ర్తిస్తున్నా కూడా క‌రోనాకు మాత్రం బ్రేకులు ప‌డ‌డం లేదు. కేవ‌లం నాలుగు కోట్ల జ‌నాభా ఉన్న స్పెయిన్‌లో సోమ‌వారం ఒక్క రోజే 913 మృతులు ఉన్నారు.

 

ఇక స్పెయిన్‌లో మొత్తం 7,846 మంది కరోనాకు బలికాగా వీరిలో గత 24 గంటల్లో మరణించిన వారు 913 మంది కావడం గమనార్హం. నాలుగు గోట్ల జ‌నాభా ఉన్న దేశంలో ఏకంగా 87, 956 మంది క‌రోనాతో బాధ‌ప‌డుతున్నారు. వీరిలో దాదాపు 8 వేల మ‌ర‌ణాలు అంటే ప‌రిస్థితి ఎంత సీరియ‌స్‌గా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. వాస్త‌వానికి స్పెయిన్ ప‌క్క‌న ఉన్న ఇట‌లీలో క‌రోనా విజృంభించ‌గా.. ఇట‌లీ ప‌క్క‌నే ఉన్న స్పెయిన్‌కు కూడా ఇది పాకేసింది. 


ఈ వైర‌స్ చూస్తూ ఉండగానే స్పెయిన్ దేశం అంతా విస్త‌రించింది. మొత్తమ్మీద చూస్తే ఈ వైరస్‌ యూరప్‌లో 25 వేల మందిని పొట్టనబెట్టుకుంది. సుమారు నాలుగు లక్షల మంది వ్యాధి కోరల్లో చిక్కుకున్నారు.

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: