వీరి ద్వారా #Coronavirus సోకే అవకాశం ఉందని అనుమానిస్తున్న వారందరిని ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు గుర్తించి, ఆసుపత్రులకు తరలిస్తున్నాయి. ఈ ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరు తమంతట తాముగా, విధిగా సమాచారాన్ని అధికారులకు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ కోరుతున్నది. మార్చ్ 13-15 మధ్య ఢిల్లీ నిజాముద్దీన్ పరిధిలోని మర్కజ్ లో మత పరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి #Coronavirus సోకింది. 

 

వారిలో తెలంగాణకు చెందిన ఆరుగురు మరణించారు. గాంధి ఆసుపత్రిలో ఇద్దరు, అపోలో ఆసుపత్రి, గ్లోబల్ ఆసుపత్రి, నిజామాబాద్, గద్వాలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.” తెలంగాణా ముఖ్యమంత్రి కార్యాలయం చేసిన ప్రకటన ఇది. ఇటీవల ఢిల్లీలోని మర్కజ్‌లో మార్చి 13 నుంచి 15 వరకు మతపరమైన ప్రార్థనలు జరగగా తెలుగు రాష్ట్రాల నుంచి  వందల మంది వెళ్లి అక్కడ ప్రార్ధనలు చేసారు. ఇక మొత్తం ఇండోనేషియా నుంచి అక్కడికి వచ్చింది 1800 మంది అని కేంద్ర హోం శాఖ వర్గాలు చెప్తున్నాయి.

 

ఇప్పుడు వారి ద్వారానే తెలంగాణాలో కరోనా వైరస్ విస్తరిస్తుంది. వారిలో కొందరు కరీంనగర్ లో దిగారు, మరికొందరు నిజామాబాద్ జిల్లాలో దిగారు. దీనితో తెలంగాణా ప్రభుత్వం వారి కోసం భారీ ఆపరేషన్ ని నిర్వహిస్తుంది. వారు ఎక్కడ ఉన్నారు...? ఎం చేసారు...? పబ్లిక్ రవాణాలో ఏమైనా ప్రయాణాలు చేసారా...? ఇలాంటి విషయాలపై ఇప్పుడు తెలంగాణా చాలా వరకు అప్రమత్తంగా వ్యవహరిస్తూ వారి కోసం పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు. ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా వారి గురించి ఇప్పుడు పెద్ద ఆపరేషన్ జరుగుతుంది. వారిని స్వచ్చందంగా బయటకు రావాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: