చైనాలో కరోనా వైరస్ తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరుగుతుంది. అక్కడి ప్రభుత్వం మళ్ళీ కేసులను దాచే ప్రయత్నం చేస్తుంది అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి, చైనా లో కరోనా వైరస్ బాధితుల సంఖ్య ఇప్పుడు 85 వేల కు చేరువలో ఉంది. అక్కడ ఒక్క కేసు కూడా మొన్నటి వరకు నమోదు కాలేదు. కాని ఇప్పుడు ఇప్పుడే కరోనా వైరస్ కేసులు క్రమంగా బయటపడుతున్నాయి. కొన్ని నగరాల్లో ఇది క్రమంగా విస్తరించింది అంటున్నారు. 

 

రాబోయే రెండు మూడు వారాల్లో బాధితులు బయటపడే అవకాశాలు ఉన్నాయి అనేది ఇప్పుడు వస్తున్న సమాచారం. ఊహాన్ నుంచి కొంత మంది బయటకు వెళ్ళారని వారిలో మళ్ళీ కరోనా బయటపడినట్టు గుర్తించారు అక్కడి అధికారులు. వాళ్ళు ఇప్పుడు బీజింగ్ కి దగ్గరలో ఉన్న ఒక నగరంలో ఉన్నారని వారిలో కరోనా లక్షణాలు ఉన్నాయని అధికారులకు సమాచారం అందింది. దీనితో ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వైరస్ కేసులు ఈసారి మళ్ళీ పెరిగే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

 

అక్కడి కేసులు ఈసారి ఎక్కువగా యువకుల్లో ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చైనాలో మరణాలు ఈ సారి భారీగా ఉండే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. చైనా మళ్ళీ కరోనాను కట్టడి చేయడానికి రంగం సిద్దం చేసింది. అక్కడి ప్రభుత్వం చాలా జాగ్రత్తలు పడుతుంది. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి మళ్ళీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఎక్కడికక్కడ రవాణా మార్గాలను కూడా పూర్తిగా మూసి వేయాలని అధికారులు భావిస్తున్నారు. ఎన్ని చేసినా సరే ఇప్పుడు చైనా బలైపోవడం ఖాయమని అంటున్నారు. రెండు వారాలు అక్కడ కీలకమని అంటున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: