కరోనా మహమ్మారి ప్రపంచమంతా విలయ తాండవం చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దేశంలోని చాలా రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకూ కేవలం 23 మాత్రమే కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మాత్రమే కరోనాతో కన్నుమూశారు. ఈ లెక్కలు చూస్తే గుండెలపై చేయివేసుకోవచ్చన్న భరోసా కనిపిస్తోంది. కానీ త్వరలోనే ఆంధ్రాలో కరోనా భూకంపం రాబోతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

 

 

ఎందుకంటే.. రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల్లో చాలా వరకూ ఢిల్లీలోని ఓ మత కార్యక్రమానికి వెళ్లి వచ్చిన వారే కావడం విశేష।ం. ఈ కార్యక్రమానికి హాజరైన వారి కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. అంతే కాదు. ఇదే కార్యక్రమానికి హాజరైన తెలంగాణవారిలో చాలా మందికి పాజిటివ్ వచ్చింది. ఢిల్లీలోనూ ఈ కార్యక్రమానికి హాజరైన వందల మందికి చికిత్స పొందుతున్నారు. గుండెల్లో దడ పుట్టించే వాస్తవం ఏంటంటే.. ఇదే కార్యక్రమానికి ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే 500 మంది వరకూ వెళ్లినట్టు తెలుస్తోంది.

 

 

అంటే వారిలో చాలా మందికి కరోనా వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు..వారి ద్వారా ఇంకా రాష్ట్రంలో ఎంత మందికి పాకి ఉంటుందన్నది ఇప్పుడు ఊహించుకోవడానికే భయంగొలుపుతోంది. ఇలా దిల్లీలోని మత కార్యక్రమానికి వెళ్లిన వారిలో అనంతపురం, కడప, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఉభయగోదావరి జిల్లాలు, విశాఖ, శ్రీకాకుళం జిల్లాలకు చెందినవారు ఉన్నారట. ఒక్క ప్రకాశం జిల్లాకు చెందినవారే 103 మంది ఉన్నారు. వారందరినీ ఒంగోలు, మార్కాపురం, చీరాలలో క్వారంటైన్‌లో ఉంచారు.

 

 

మరో భయంగొలిపే వాస్తవం ఏంటంటే.. దిల్లీ కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ యువకుడి తల్లిదండ్రులు ఒక రోజు వ్యవధిలోనే మరణించారు. దిల్లీ వెళ్లి వచ్చిన మరొకరు తూర్పు గోదావరిలో మరణించారు. అయితే వీరికి ఇంకా కరోనా నిర్థరణ కాలేదు. మొత్తానికి దిల్లీ కార్యక్రమం ఏపీ వాసుల గుండెల్లో దడ పుట్టిస్తోంది.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: