ఒకరకంగా చెప్పాలి అంటే మన దేశంలో కరోనా వైరస్ ఇప్పుడు చాలా వరకు అందుబాటులోనే ఉంది. ఇది మరింత పెరిగితేనే ఇబ్బంది గాని ఇప్పటి వరకు మన దేశంలో దీని వలన వచ్చే ఇబ్బందులు అంటూ ఏమీ లేవు. ఇప్పుడు కట్టడి చెయ్యకపోతే మాత్రం దాన్ని ఆపడం చాలా కష్టం. ఒక్కసారి బాధితుల సంఖ్య అనేది రెండు వేలు దాటితే మాత్రం కరోనా వైరస్ ఎదుర్కోవడం మనకు కచ్చితంగా సవాల్. ఎదుర్కోవడం చాలా కష్టం. 

 

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం చాలా సురక్షితంగా ఉన్నాము అనేది ప్రపంచం కూడా చెప్పే మాట. ఇది పక్కన పెడితే ఇప్పుడు కేంద్రం కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి గానూ కాస్త గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు ఆస్పత్రుల సంఖ్యను పెంచడానికి గానూ కొందరు ప్రముఖుల ఇళ్ళను అద్దెకు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఉదాహరణకు ఒక గ్రామంలో కరోనా వైరస్ బయటపడితే... 

 

ఆ గ్రామం మొత్తాన్ని క్వారంటైన్ కి తరలించడం, ఆ చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలను హోం క్వారంటైన్ చేయడం. దీనిపై ఇప్పటికే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో కసరత్తులు చేస్తుంది. దీన్ని తక్షణమే అమలు చెయ్యాలని చూస్తుంది. కొన్ని కొన్ని ఫంక్షన్ హాల్స్ సహా మరికొన్నింటిని ఇప్పుడు అద్దెకు తీసుకుని వాటిలో క్వారంటైన్ ఏర్పాటు చెయ్యాలని రాష్ట్రాలకు కూడా కేంద్ర ప్రభుత్వం సూచనలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. దీన్ని త్వరలోనే అమలు చెయ్యాలని, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఉండాలని కేంద్రం రాష్ట్రాలకు సూచిస్తుంది. రెండు మూడు రోజుల్లో ఇది కార్యరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: