జగమంతా  ఒకటే భయం... కంటికి కనిపించని శత్రువు ఎటునుంచి దాడిచేస్తుందో అనే ప్రాణభయం... మనకు తెలియకుండా మన మీదే దాడి చేసి ఎక్కడ మృత్యుఒడిలోకి నెడుతుందో అనే భయం... బయటికి వెళ్ళాలి అన్న భయం... ఇంట్లో ఉండాలి అన్న భయం... ఇలా ప్రతీ విషయంలో భయం భయం... ప్రస్తుతం ప్రపంచమంతా ఇదే భయం. ఈ భయానికి కారణం ప్రాణాంతకమైన విష గాలి కరోనా  వైరస్. చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి వైరస్ ప్రస్తుతం అందరిని ప్రాణభయంతో వణికిస్తోంది. ప్రపంచ దేశాలన్నీ ఈ కరోనా  భూతం కారణంగా అల్లాడి పోతున్నాయి. ఏకంగా దేశాల అధ్యక్షులను సైతం మేము ఏమీ చేయలేము అంటూ చేతులెత్తేసేలా  చేస్తుంది ఈ మహమ్మారి వైరస్. రోజురోజుకు ప్రపంచదేశాల్లో విజృంభిస్తున్న ఈ మహమ్మారి వైరస్... ఎంతోమందిని మృత్యుఒడిలోకి నెడుతుంది . చాలా మంది ఈ వైరస్ బారినపడి మృత్యువుతో పోరాడుతూ ఓడిపోతున్నారు. 

 

 ప్రపంచవ్యాప్తంగా పంజా విసురుతున్న కరోనా వైరస్ ఎంతో మందిని పొట్టన పెట్టుకుంటోంది. దీంతో ప్రజలందరూ ప్రశ్నార్థకమైన ప్రాణభయం ఉన్న జీవితాన్ని గడుపుతున్నారు. రోజురోజుకు ప్రపంచ దేశాలు మొత్తం కరోనా  వైరస్ బారినపడి చిగురుటాకులా వణికిపోతున్నాయి . ఏం చేస్తే ప్రాణాలు కాపాడు కోవచ్చు అని దాని పైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. కనిపించని శత్రువు  తో పోరాటం చేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి  ప్రపంచ దేశాలు. కానీ కరోనా వైరస్ మాత్రం కనికరం లేని వైరస్ లాగా ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటూనే ఉంది. దీంతో ప్రతి ఒక్కరిలో వెన్నులో వణుకు పుట్టిస్తుంది ఈ మహమ్మారి వైరస్. 

 

 

 మొన్నటి వరకు కేవలం వందల్లో  మాత్రమే ఉన్న ఈ మహమ్మారి బాధిత మరణాల సంఖ్య ఇప్పుడు వేలల్లోకి  చేరింది. ఇప్పటికే 38 వేల మంది ఈ మహమ్మారి వైరస్ బారినపడి చనిపోగ..ఈ మరణాల సంఖ్య  40 వేలకు చేరువలో వెళ్లే అవకాశం కూడా ఉంది. కరోనా  వైరస్ వల్ల బతికున్నప్పుడే కాదు చనిపోయినప్పుడు కూడా శవానికి   కూడా ఇబ్బందులె. ఎవరైనా కరోనా  వైరస్ సోకి చనిపోతే.. కనీసం వారి కడ చూపుకు  కూడా నోచుకోవడం లేదు కుటుంబీకులు. అంత్యక్రియలు చేసేందుకు కూడా కరోనా  వైరస్ సోకి చనిపోయినవారి మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించడం లేదు. కనీసం ముట్టుకొనివ్వడంలేదు. ఇలాంటి ఘటనలతో ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తుంది ఈ మహమ్మారి కరోనా వైరస్ .

మరింత సమాచారం తెలుసుకోండి: