క‌రోనా వైర‌స్‌(కోవిడ్-19).. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌ను ఏ స్థాయిలో వ‌ణికిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచమంతా విస్తరిస్తూ అనేక మంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. రోజురోజుకి ఈ వైరస్ బారిన పడి మృత్యుఒడికి చేరుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. బాధితుల అయితే ల‌క్ష‌ల్లోనే ఉన్నారంటే.. ఈ వైర‌స్ ప్ర‌భావం ఏ రేంజ్‌లో ఉందో స్ప‌ష్టంగా అర్థం అవుతోంది. దీంతో ఆయా దేశాలు క‌ఠ‌న చ‌ర్య‌లు చేప‌ట్టాయి. భారత్ లోనూ కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు భారత ప్రభుత్వం 21రోజుల లాక్ డౌన్ ప్రకటించింది. 

 

ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ చూసినా, ఎవరినోట విన్నా కరోనా.. క్వారంటైన్.. ఐసోలేషన్.. ఇలాంటి మాటలే వినిపిస్తున్నాయి. చైనాలోని వూహాన్‌లో డిసెంబ‌ర్ ఆక‌రిలో బయటపడిన కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం ప్రపంచం మొత్తం వణికిపోతోంది. అయితే క‌రోనా బ‌య‌ట ప‌డిన త‌ర్వాత మొద‌టి రెండు నెల‌ల్లో నాలుగు వేల మంది మృతి చెంద‌గా.. కేవ‌లం మార్చి నెల‌లోనే 33 వేల మంది మృతి చెందిన‌ట్టు తెలుస్తోంది. ఇక ఈ విష‌యం బ‌య‌ట‌కు రావ‌డంతో ప్ర‌జ‌ల్లో మ‌రింత ఆందోళ‌న‌ రేగుతోంది. ఇక ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా 783277 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

 

వీటిలో 164753 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. మరణాల సంఖ్య 37744గా ఉంది. ప్రస్తుతం 580780 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. వీళ్లలో 551190 మందికి కరోనా అంతంతమాత్రంగానే ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు గంటగంటకూ పెరుగుతున్నాయి. అయితే వీటిలో చల్లటి వాతావరణం ఉన్న దేశాల్లోనే ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోందన్న విషయాన్ని ప్రజలు గమనించాలి. కాగా, ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకుని అన్ని దేశాలూ విలవిలలాడుతున్నాయి. ప్రపంచంలోని సగానికిపైగా దేశాలు లాక్‌డౌన్‌లో కొనసాగుతుండగా.. దాదాపు 350 కోట్ల మంది ప్రజల నిర్బంధంలోనే ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ క‌రోనా కేసులు బ‌య‌ట‌ప‌డుతూనే ఉన్నాయి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: