దేశంలో రోజురోజుకు విజృంభిస్తూ... ఎంతోమందిని మృత్యువుతో పోరాడేలా చేస్తూ ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తున్న మహమ్మారి కరోనా  వైరస్ ను జయించడానికి దేశం మొత్తం పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. కంటికి కనిపించని శత్రువును తరిమి కొట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ వైరస్కు సరైన వ్యాక్సిన్ లేకపోవడం కేవలం నివారణ ఒక్కటే మార్గం కావడంతో... దేశ ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఈ మహమ్మారి ప్రాణాంతకమైన వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ఎన్నో కఠిన నిబంధనలు అమల్లోకి తెస్తున్నాయి. ప్రజలు  సమూహాలుగా ఉండకుండా ఉండేందుకు... కేవలం ఇంటికే పరిమితం అయ్యేలా చేసి... ప్రపంచ మహమ్మారిగా గుర్తించబడిన కరోనా  వైరస్ను తరిమికొట్టి విజయం సాధించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. 

 

 

 ఈ క్రమంలోనే ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్  ద్వారా ప్రజలెవరూ బయటకు రాకుండా చూసి క్రమక్రమంగా వైరస్ ను నియంత్రించేందుకు ప్రయత్నం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇక అటు ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరిస్తూ కరోనా  వైరస్ బారిన పడకుండా ఉండేందుకు వ్యక్తిగత పరిశుభ్రతను కూడా పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వైరస్ నుంచి తప్పించుకునేందుకు శానిటైసర్  ఎక్కువగా వినియోగిస్తున్నారు ప్రజలు. కానీ కరోనా వైరస్ నుంచి తప్పించుకోవడానికి వాడిన శానిటైసర్  ఒక వ్యక్తి విషయంలో అపాయానికి దారి తీసింది . శానిటైసర్  కారణంగా ఆ వ్యక్తి 35 శాతం కాలిపోయాడు. శానిటైసర్  కారణంగా కాలిపోవడం ఏమిటి అంటారా...!

 

 

 హర్యానాలోని రేవారి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి శానిటైసర్ తో మొబైల్ స్క్రీన్ క్లీన్ చేస్తున్నాడు. ఇక అదే సమయంలో అక్కడే ఉన్న భార్య వంట చేస్తుంది. కాగా ఉన్నట్టుండి శానిటైసర్  నుండి మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో సదరు వ్యక్తి 35 శాతం కాలి పోయాడు. ఇక దీన్ని గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రున్ని  హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఇక అతనికి చికిత్స అందించిన వైద్యులు అతని ప్రాణాలను కాపాడారు. అయితే దీనిపై మాట్లాడిన వైద్యులు.. కరోనా  వైరస్ నేపథ్యంలో అందరూ శానిటైసర్లతో తిరుగుతున్నారని... శానిటైసర్  విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని లేకపోతే అపాయం తప్పదు అంటూ తెలిపారు. శానిటైసర్ లో ఆల్కహాల్ వాయువు ఎక్కువగా ఉండటం వల్ల... ప్రమాదం జరిగే అవకాశం ఉంది అంటున్నారు. శానిటైసర్  కారణంగా గాయపడిన వ్యక్తి చొక్కా  పై శానిటైసర్  పడడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: