ప్రస్తుతం దేశం మొత్తాన్ని బెదరగొడుతున్న కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ముందస్తు నివారణ చర్యలు తీసుకుంటున్నాయి. ఏకంగా కేరళ ముఖ్యమంత్రి అయితే ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి మరియు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉన్నవారికి మందు సరఫరా చేయమని చెప్పడం కూడా చూస్తుంటే మహమ్మారి ఎవరిచేత ఎంత పనైనా చేయించగలదు అని అర్థమవుతోంది. ప్రజల ప్రాణాలు ముఖ్యం కాబట్టి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కఠినమైన మరియు సంచలన నిర్ణయాలను తీసుకోవడానికి కూడా మాత్రం వెనుకాడడం లేదు.

 

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇప్పటి వరకూ 23 కరుణ పాజిటివ్ కేసులు బయటపడగా... సంఖ్యను వీలైనంత తక్కువకి కుదించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన ఉచిత రేషన్ కోసం ప్రజలంతా ఉదయం 6 గంటల నుండి రేషన్ షాపులు బయట నిలబడుతున్నారు. సామాజిక దూరం కోసం బయట వారి కోసం ఒక మీటర్ దూరంలో వృత్తాలు గీసినా కూడా అందులో నిలబడకుండా పక్కకు వెళ్ళి నీడలో గుమిగూడుతున్నారు.

 

ఇకపోతే కొంతమంది రేషన్ షాపు దుకాణాదారులు ఆరుగంటలకే షాపు తీయకుండా ఆలస్యం చేయడం.... 11 గంటల తర్వాత పోలీసులు మిగతా వారిని పంపించడం ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది. అయితే వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ప్రతి ఇంటికి రేషన్ పంపిస్తామని ఇంటివద్దకే సరుకులు తీసుకొస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని ఇప్పుడు విపక్షాలు ఎత్తి చూపిస్తున్నాయి. ఇటువంటి సమయంలో కూడా గ్రామ వాలంటీర్లు చేత ఎందుకు పని చేయించట్లేదని అందరూ మండిపడ్డారు. అదే సమయంలోఇంటింటికి వెళ్లి రేషన్ సరుకులు ఇస్తే ప్రజలు ఒకే చోట ఉండరు కాబట్టి అసలు కరోనా వ్యాపించే అవకాశమే లేదు అన్నది వారి వాదన.

మరింత సమాచారం తెలుసుకోండి: