ప్రపంచాన్ని మొత్తం చిగురుటాకులా వణికిస్తోంది ... ప్రజలందరినీ ప్రాణభయంతో బెంబేలెత్తిస్తున్నది  మహమ్మారి కరోనా వైరస్. ప్రపంచదేశాలన్నీ ఎన్ని కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చినప్పటికీ... కరోనా  వైరస్ ప్రభావం మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. రోజురోజుకు పంజా విసురుతున్న ఈ మహమ్మారి వైరస్ కోరలు చాస్తూ ఎంతోమందిని మృత్యుఒడిలోకి నెడుతుంది. ఇంకా ఎంతో మంది మృత్యువుతో పోరాడేలా  చేస్తుంది. ప్రజలందరిలో వెన్నులో వణుకు పుట్టిస్తోంది ఈ మహమ్మారి వైరస్. ఇలా రోజురోజుకు విజృంభిస్తున్న ఈ వైరస్ కు విరుగుడు లేకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. అయితే కరోనా  వైరస్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఈ వైరస్ పై ఎన్నో అధ్యయనాలు జరుగుతున్న విషయం తెలిసిందే. 

 

 

 ఆయా అధ్యయనాల్లో కరోనా  వైరస్ కు సంబంధించి సరికొత్త విషయాలను తెలుపుతున్నారు శాస్త్రవేత్తలు. ఇక తాజా అధ్యయనంలో  శాస్త్రవేత్తలు సరి కొత్త విషయాలను వెల్లడించారు. ఈ ప్రాణాంతకమైన కరోనా వైరస్ 2019 డిసెంబర్ నెలలో మనుషులకు వ్యాపించలేదని... దాదాపు పదేళ్ల కిందటే ఈ వైరస్ వ్యాపించి ఉంటుంది అంటూ అనుమానం వ్యక్తం చేశారు పరిశోధకులు. ఇక తమ అధ్యయన వివరాలన్నింటినీ జర్నల్ ఆఫ్ నేచర్ మెడిసిన్ రాసిపెట్టింది. ఇక ఈ అధ్యాయనంలో  ఆస్ట్రేలియా బ్రిటన్ అమెరికా సైంటిస్టులు ఉన్నారు. మార్చి 17వ తేదీన తమ అధ్యయన వివరాలను వెల్లడించారు. అయితే ఈ అధ్యయన వివరాలను చదివిన తర్వాత అందరికీ ఒక డౌట్ వస్తుంది... పదేళ్ల కిందటే కరోనా వైరస్ వ్యాప్తి చెంది ఉంటే ఇప్పటి వరకు ఎందుకు ఎవరు ఈ వైరస్ కారణంగా చనిపోలేదు అన్నది.

 

 

 దీనికి కూడా ఆ అధ్యయన బృందం ఒక ఆసక్తికర సమాధానమిచ్చింది. కొన్నేళ్ల కిందటే మనుషులు లోకి ప్రవేశించిన ఈ మహమ్మారి వైరస్... క్రమక్రమంగా జన్యుపరమైన మార్పులు చేసుకుంటూ ఉంది అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. మొదట్లో ఎంతో బలహీనంగా  ఉన్న ఈ మహమ్మారి వైరస్ క్రమక్రమంగా బలం పెంచుకుంటూ మనుషుల నుండి మనుషులకు వ్యాపించేంత   బలాన్ని సమకూర్చుకుని ప్రపంచదేశాలకు వ్యాపిస్తుందని అనుమానిస్తున్నారు. ఇంకొంత మంది శాస్త్రవేత్తలు మరో ఆసక్తికర అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. ఈ మహమ్మారి వైరస్ మొదట చైనా దేశంలోని వుహాన్  నగరంలో వెలుగులోకి రాలేదని అంతకుముందే ఇటలీలో అత్యధిక కేసులు  నమోదవుతున్న లంబార్డీలో  ఈ వైరస్ సోకి ఉండవచ్చు అని అంటున్నారు. చైనాలోని ఓ డాక్టర్ కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. 2019 సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా అంతుపట్టని నిమోనియా కేసులు వెనుక కరోనా  వైరస్ ఉండొచ్చు అని చైనాకు చెందిన ఓ డాక్టర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: