ప్రపంచాన్ని కరోనా వైరస్ పట్టి పీడిస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో దేశంలొో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  అయితే ఇప్పుడు దేశంలో ప్రజలంగా ఇంటి పట్టునే ఉంటున్నారు.  అందరూ ఒక్కతాటిపైకి వచ్చి కరోనాపై పోరాడుతున్నారు.  తాజాగా కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అనుగుణంగా కొంత మంది జనాలు మాత్రం ఉండటం లేదు.  ఏదో ఒక కారణం చెప్పి బయట తిరగడం మొదలు పెట్టారు. దాంతో పోలీసులు లాఠీ చార్జీ చేసిన ప్రయోజనం లేకుండా పోతుంది.

 

 దాంతో ఇక జరిమానాలను విధించేలా చర్యలు తీసుకుంది. భారీగా ఫైన్ విధిస్తోంది. జరిమానాలను వసూలు చేస్తోంది కేసీఆర్ సర్కార్.  ఎలాంటి కారణం లేకుండా రోడ్ల మీద తిరిగే వారి సంఖ్య గ్రామస్థాయిలో మరింత ఎక్కువగా ఉంటోంది. దీన్ని అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం కొత్తగా జరిమానాలను విధించే ప్రక్రియను చేపట్టింది. ఒకేరోజు మూడుసార్లు లేదా అంతకు మించి ఎక్కువసార్లు కనిపిస్తే.. 500 రూపాయల వరకు జరిమానా విధిస్తోంది. లాక్‌డౌన్ కొనసాగుతున్న ప్రస్తు పరిస్థితుల్లో ఒకేరోజు మూడుసార్లు బయట తిరుగుతూ కనిపించడం వల్ల 500 రూపాయల జరిమానా విధించినట్లు ఇటిక్యాల గ్రామ కార్యదర్శి వెల్లడించారు.  కరోనా వల్ల ఎంతో ప్రమాదం ఉంది.

 

ఈ రెండు మూడు రోజుల్లో దాని ప్రమాద స్థాయి మరింత పెరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి ప్రతిసారి సమీక్షలు నిర్వహించి ప్రజలను హెచ్చరిస్తూనే ఉన్నారు.  కానీ కొంత మంది ఆకతాయిలు.. మరీ అవసరం ఉన్న వారు మాత్రం బయట తిరుగుతూనే ఉన్నారు.  ఆదివారం ఈ తాకిడి మరింత ఎక్కువ కనిపించింది. ఈ నేపథ్యంలోనే . జగిత్యాల జిల్లా రాయికల్ మండల్ ఇటిక్యాలలో తొలిసారిగా మిట్టమెల్లి రాజారెడ్డి అనే వ్యక్తికి ఫైన్ వేశారు. ఒకేరోజు మూడుసార్లు రోడ్ల మీద తిరుగుతూ కనిపించడంలో అతనిపై జరిమానా విధించారు. అతని వద్ద నుంచి 500 రూపాయలను వసూలు చేశారు.

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: