ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్  కోరలు చాస్తూ  ఎంతో మందిని బలి తీసుకున్న విషయం తెలిసిందే. శరవేగంగా వ్యాప్తిచెందుతూ  ఎంతోమందిని మృత్యు ఒడిలోకి నెట్టుతుంది . అయితే ముఖ్యంగా వృద్ధులకు ఈ మహమ్మారి వైరస్ ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్యులు తెలిపారు. 60 నుంచి 65 ఏళ్ల వయసు పైబడిన వారికి ఈ వైరస్ సోకుతుంది 65 ఏళ్లు పైబడిన వృద్ధుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి... వారికి ఎక్కువ ప్రమాదం ఉంది  అంటూ కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో చాలా మంది కరోనా  వైరస్ పై  కాస్త నెగ్లెట్ గానే  ఉంటున్నారు. 65 ఏళ్లు పైబడిన వారు వృద్ధులు కరోనా  వైరస్ తమ దరికి చేరకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ... 60 ఏళ్ల లోపు వయసు ఉన్న వాళ్లు.. ముఖ్యంగా యువకులు ఈ ప్రాణాంతకమైన వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉండడం లేదు. 

 

 

 60 ఏళ్ల లోపు ఉన్న వారు,  యువత తమ దరికి వైరస్ రాదు  అన్న ధీమాతో ఉన్నారు. అయితే ఇకనుంచి ఇలాంటి భ్రమలు  వదులుకోవాల్సిందే అని అంటున్నారు వైద్యులు. కరోనా  వైరస్కు వయసుతో సంబంధం లేదని తాజాగా ఓ నివేదికలో వెల్లడయ్యింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ కూడా ఇలాంటి హెచ్చరికలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని బలి తీసుకుంటున్న మహమ్మారి ప్రాణాంతకమైన వైరస్ తమను ఏమీ చేయలేదు అనే భ్రమలో యువత ఉండవద్దు అంటూ సూచించిన ఆయన ఆ భ్రమ  నుంచి బయటకు రావాలని... కరోనా  వైరస్కు ఎవరూ అతీతులు కాదు అంటూ పేర్కొన్నారు. 

 

 

 ఇక తాజాగా అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ జరిపిన అధ్యయనంలో వెల్లడైన విషయాలు ప్రస్తుతం అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. అమెరికాలో కరోనా  వైరస్ బారిన పడిన ఐదువందల మందిపై జరిపిన ఈ అధ్యయనంలో వెల్లడైన విషయాలను అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ విడుదల చేసింది. కరోనా వైరస్ బారినపడి ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న వారిలో... 10 నుంచి 20 శాతం మంది 44 ఏళ్ల వయస్సు లోపు వారేనని పేర్కొంది. 30 శాతం మంది 45 ఏళ్ల నుంచి 54 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు ఉన్నారని... 55 ఏళ్ల నుంచి 64 ఏళ్లలోపు వయస్సు ఉన్న వారు 36% మంది కరోనా  వైరస్ బారిన పడినట్లు  అధ్యయనం వెల్లడించింది. అంతేకాకుండా 19 ఏళ్ళ లోపు ఉన్న వారికి కూడా ఈ మహమ్మారి వైరస్ సోకే అవకాశం ఉంది అంటూ ఈ అధ్యయన నిపుణులు వెల్లడించారు. అయితే ఈ వైరస్ బారిన పడిన వారిలో మరణించిన వారు మాత్రం 65 ఏళ్లు పైబడిన వారే ఎక్కువగా ఉన్నారు అంటూ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: