చైనాలో ప్రత్యేకించి వూహాన్ నగరంలో జరుగుతున్నది చూస్తుంటే అందరికీ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పై ఫొటోలో ఏమున్నాయో చూశారు కదా. చైనా వాళ్ళు తినని జంతువంటూ దాదాపు ఉండదనే అనుకోవాలి. పాములు, గబ్బిలాలు, పిల్లులు, పునుగు పిల్లులు, చీమలు, తొండలు, బల్లులు ఇలా.. చెప్పుకుంటు పోతే వాళ్ళు ఇష్టపడి తినే తిండి జాబితా చేంతాడంత ఉంటుంది. గబ్బిలాలే తిన్నారో లేకపోతే పాములనే తిన్నారో స్పష్టంగా తెలీదు కానీ యావత్ ప్రపంచం ఇపుడు కొరోనా వైరస్ తో ఎంతగా వణికిపోతోందో అందరూ చూస్తున్నదే.

 

చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిన కొరోనా వైరస్ యావత్ ప్రపంచదేశాలను వణికించేస్తోంది. లక్షలది మంది బాధితులుగా మారిపోతుంటే వేలామంది మంది మరణించారు. అసలు వైరస్ దెబ్బకే కదా వూహాన్ నగరాన్ని లాక్ డౌన్ చేసేసింది చైనా ప్రభుత్వం. దాదాపు 2 నెలల తర్వాత పరిస్దితులు చక్కబడ్డాయని అనుకున్న తర్వాతే చైనా ప్రభుత్వం వూహాన్ లో లాక్ డౌన్ ఎత్తేసింది. సమస్యంతా  ఇక్కడే మొదలవుతోంది.

 

ఎప్పుడైతే లాక్ డౌన్ ఎత్తేసిందో వెంటనే జనాలంతా రోడ్ల మీదకు వచ్చేశారు. పోనీలే నెలల తర్వాత రోడ్లమీదకు వచ్చారనుకుంటే మళ్ళీ జంతువుల మార్కెట్లను మొదలుపెట్టేశారు. వైరస్ దెబ్బకు నెలల తరబడి నాన్ వెజ్ టేరియన్ కు దూరంగా ఉన్నారో ఏమో ? లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తేసేటప్పటికి మళ్ళీ మార్కెట్లు కళకళలాడుతున్నాయి. మార్కెట్లంటే ఏవో పప్పులు ఉప్పులనుకునేరు. మళ్ళీ పాములు, పిల్లులు, గబ్బిల్లాలాంటి వాటిని చంపేసి వాటిని మార్కెట్లో అమ్మకానికి  పెట్టేశారు.

 

ఇపుడివన్నీ కొనుక్కుతిని మళ్ళీ ప్రపంచదేశాల కొంపలు ముంచుతారో ఏమో పాడో ఈ చైనా వాళ్ళు.  ఎక్కడో చైనాలోని జనాలు నానా చెత్త తినటం ఏమిటి ? ప్రపంచమంతా ముక్కులు మూసుకుని చేతులు కడుక్కోవటం ఏంటో ? ఒకసారి తిన్నందుకే ప్రపంచదేశాలన్నీ ఆగమాగమవుతున్నాయి. మళ్ళీ రెండోసారి తింటే ఏమవుతుందో ఏమో ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: