కొంతమంది వ్యక్తులు చేసే పిచ్చి చేష్టలు చేసేవారికి సరదాగానే ఉన్నప్పటికీ మిగతా వారికి మాత్రం భయాందోళనకు గురి చేస్తూ ఉంటాయి. ఇంకొంతమంది చేసే చేష్టలు ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఇలా చిత్రవిచిత్రమైన చేష్టల  కారణంగా ఎన్నో ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఓ వ్యక్తి చేసిన పనికి స్థానికులు అందరూ ఆశ్చర్యపోయారు. ఎక్కడ ప్రాణాల మీదికి వస్తుందోనని భయపడిపోయారు. దీంతో వెంటనే ఎమర్జెన్సీ కాల్ సెంటర్ కి సమాచారం అందించడంతో... ఆ వ్యక్తి కటకటాలపాలయ్యాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఏం చేశాడు అంటారా.. శునకంతో కారు నడిపించాడు... అది కూడా ఏదో తక్కువ వేగంతో అనుకునేరు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో పెంపుడు కుక్కతో కార్ డ్రైవింగ్ చేయించాడు సదరు వ్యక్తి. దీంతో ఇది చూసిన ప్రజలు ఒకింత ఆశ్చర్యానికి ఒకింత షాక్ మరింత భయాందోళనకు గురయ్యారు. 

 

 వివరాల్లోకి వెళితే... పశ్చిమ అమెరికా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి చేసిన పనికి పోలీసులు సైతం అవాక్కయ్యారు. పశ్చిమ అమెరికా ప్రాంతం దక్షిణ సీటెల్ లో నివసించే ఆల్బర్ట్ టోటో  అనే 51 ఏళ్ల వ్యక్తి... కుక్కతో డ్రైవింగ్ చేయించాడు. కుక్కను డ్రైవింగ్ సీట్ లో పెట్టి... అతను ప్యాసింజర్ సీట్లో కూర్చొని... కారును తోలాడు . ఏకంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో కారుని తోలాడు  సదరు వ్యక్తి. ఇక ఇది గమనించిన స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురై వెంటనే ఎమర్జెన్సీ కాల్ సెంటర్ కు కాల్ చేసి సమాచారం అందించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతడిని వెంబడించి పట్టుకున్నారు. 

 

 

 అయితే ఈ విషయం తెలిసిన ఓ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారి ఏకంగా షాక్కు గురైనట్లు తెలిపారు. ఇప్పుడు వరకు అతి వేగంతో కారు నడిపిన వారిని ఎంతోమందిని పట్టుకున్నామని... పోలీసులకు చిక్కిన తర్వాత చాలా మంది చెప్పే కుంటి సాకులు  తమకు తెలుసంటూ చెప్పిన పోలీస్ అధికారి... తాజాగా కుక్కతో కార్ నడిపించిన వ్యక్తి చెప్పిన సమాధానంతో షాక్ కి  గురైనట్లు  తెలిపాడు. ఎందుకు అంత వేగంగా కారు నడిపావ్  అంటూ సదరు వ్యక్తిని ప్రశ్నిస్తే... కుక్క కి కార్ డ్రైవింగ్ నేర్పిస్తున్న అని సమాధానం ఇవ్వడంతో పోలీసులు సైతం షాక్ అయ్యారు. ఇక దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసు అధికారులు... కుక్కను షెల్టర్  పెట్టి... నిందితుడిపై డ్రగ్స్ మోటార్ వాహనాల చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: