ప్రజలంతా కరోనా భయంతో ఉంటే కొందరు పనికి మాలిన, ఏ పనిపాటలేని దద్దమ్మలు మాత్రం అసత్య ప్రచారాలకు తెర తీస్తున్నారు.. ఇప్పుడు చేతిలో ఉన్న సోషల్ మీడియా ద్వారా సమాజానికి ఎంతో మేలు చేయవచ్చు కానీ ఈ దిశగా ఆలోచించక మూర్ఖుల్లా కీడు చేస్తున్నారు.. పచ్చ కామెర్లోనికి లోకమంతా పచ్చగానె ఉంటుందన్నట్లుగా, తప్పుడు మనుషులకు ఉపయోగపడే విషయమైనా.. తప్పుగానే అర్ధం అవుతుంది లోకంలో కొందరి తీరు ఇదే..

 

 

ఇదిలా ఉండగా కరోనా వైరస్ ఎంత ప్రమాదకరమైందో అందరికి ఈపాటికే అర్ధం అయ్యి ఉంటుంది.. ఇలాంటి టైంలో కొందరు అతి ఉత్సాహానికి పోయి అనర్ధాలకు కారణం అవుతున్నారు.. ఇప్పటికే పోలీసులు, ప్రభుత్వాలు కరోనా వైరస్‌పై తప్పుడు ప్రచారం చేస్తే కఠినచర్యలు తప్పవని ఎన్నిసార్లు హెచ్చరించినా కొంతమందిలో మార్పు రావడం లేదు. ఇదిగో ఒక పనికిమాలిన మహిళ ఇలాంటి తప్పుచేసి శిక్షను అనుభవిస్తుంది.. దీనికి సంబంధించిన వార్తను తెలుసుకుంటే..

 

 

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా సోషల్‌మీడియాలో వదంతులు వ్యాప్తి చేస్తున్న, జ్యోతీష్‌రాయ్‌ రోడ్‌ ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల మహిళకు తగిన బుద్ధి చెప్పారు పోలీసులు.. ఈ మహిళ నయాఅలీపూర్‌ ప్రాంతంలో 15 మందికి కరోనావైరస్‌ పాజిటివ్‌ తేలిందని, ఆ విషయాన్ని ప్రభుత్వం దాచి పెట్టిందంటూ వాట్సాప్‌ గ్రూప్‌లో ఈ అసత్య సమాచారాన్నిషేర్‌ చేసింది.

 

 

ఈ విషయాన్ని గమనించిన కొందరు భయంతో పోలీసులకు తెలుపగా, వెంటనే రంగంలోకి దిగిన వారు.. సదరు మహిళను ఆ వార్తకు సంబంధించి సాక్ష్యాలు తెలుపమని ప్రశ్నించగా, తడబడటంతో అదుపులో తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఇకపోతే సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారుని ఉపేక్షించేది లేదని పోలీసులు తరచుగా హెచ్చరిస్తున్నారు. అదీగాక ఈ టైంలో ఇలాంటి పనులు చేయడానికి సిగ్గు ఉండక్కర్లేదా అంటూ నెటిజన్స్ కూడా కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: