దేశంలో రోజు రోజుకీ కరోనా వ్యాప్తి పెరిగిపోతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి.  కరోనాని ఇప్పుడు అరికట్టకుంటే దీని తీవ్రత మరింత పెరిగి వినాశం జరుగుతుందని అంటున్నారు.  ఈ సమయంలో అందరూ ఇంటి పట్టున ఉండి లాక్ డౌన్ ని విజయవంతం చేస్తే పూర్తి స్థాయిలో అరికట్ట వొచ్చని అంటున్నారు.  కానీ కొంత మంది మాత్రం లాక్ డౌన్ ఏమాత్రం ఖాతరు చేయడం  లేదు.  ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.

 

దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు .. ఈ నెల 13నుంచి 15వ తేదీ మధ్య ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలో మతపరమైన ప్రార్ధనల్లో పాల్గొన్న కొందరికి కరోనా సోకిందని, వారిలో తెలంగాణ కు చెందిన వారు కూడా ఉన్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన ఆరుమంది తెలంగాణవాసులకు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించడం కలవరానికి గురి చేస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. ప్రార్థనల్లో పాల్గొన్న వారందర్నీ ఆసుపత్రులకు తరలిస్తోంది ఢిల్లీ సర్కార్.

 

ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ నుంచి పెద్ద సంఖ్యలో బస్సులను ఏర్పాటు చేసింది. మంగళవారం తెల్లవారు జాము నుంచే వారందర్నీ అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారుల. ప్రత్యేక బస్సుల్లో వారందర్నీ వేర్వేరు ఆసుపత్రులకు తరలిస్తున్నారు. 14 రోజుల పాటు తప్పనిసరి క్వారంటైన్‌లో ఉండాలంటూ ఆదేశాలను జారీ చేశారు. ప్రార్ధనా కార్యక్రమాలపై ఎఫ్ ఐఆర్ నమోదు. కరోనా వైరస్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది కేంద్రప్రభుత్వం. అయితే ఈ లాక్ డౌన్ ను ఉల్లంఘిస్తూ మతపరమైన కార్యక్రమాలు చేపట్టినందుకు ఢిల్లీ పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: