కరోనా వైరస్ బాధితులకు చికిత్స అందించే విషయంలో అమెరికాలోని ఆసుపత్రులు సంచలన నిర్ణయం తీసుకున్నాయా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ప్రపంచదేశాలను వైరస్ ఎంతగా వణికించేస్తోందో అందరూ చూస్తున్నదే. ఇటలీ, స్పెయిన్ దేశాలను వదిలిపెట్టేస్తే అమెరికాలో కరోనా వైరస్ చాలా స్పీడుగా విస్తరిస్తోంది. అందుకనే రోగులకు వైద్యం అందించే విషయంలో బతుకుతాడు అని నమ్మకం ఉన్న వాళ్ళని మాత్రమే ఆసుపత్రుల్లో చేర్చుకుంటున్నాయి.

 

ఈ పరిస్ధితి అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్, వాషింగ్టన్, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తోందట. అమెరికాలో తాజా సమాచారం ప్రకారం సుమారు 1.5 లక్షల మంది కరోనా వైరస్ బారినపడ్డారు. వీరుకాకుండా సుమారు 2600 మంది చనిపోయారు. ఇన్ని వేలమందికి ఒకేసారి వైద్యం అందించే సామర్ధ్యం ఆసుపత్రుల్లో లేదు. ఎందుకంటే రోగులకు అవసరమైన వెంటిలెటర్లు, బెడ్లు, వైద్య సిబ్బంది సరిపడా లేదు. అమెరికాలో 2.25 లక్షల రీ యూజబుల్ వెంటిలేటర్లున్నాయి. అయితే ప్రస్తుత మెడికల్ ఎమర్జెన్సీ ప్రమాణా ప్రకారం అమెరికాకు అవసరమైన వెంటిలేటర్లు 9 లక్షలు కావాలి.

 

అంటే అవసరానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాటికి ఎంత తేడా ఉందో అర్ధమైపోతోంది కదా. ఇదే పద్దతిలో బెడ్లు కూడా . అందుకనే రోగులను నాలుగు రకాలుగా విభజిస్తున్నాయట ఆసుపత్రులు. మొదటిది యువకులు, రెండో క్యాటగిరి వృద్ధులు, మూడో క్యాటగిరి చిన్నపిల్లలు, నాలుగో క్యాటగిరిలో వృద్ధుల్లో కూడా ఇతరత్రా ఏవైనా అనారోగ్య హిస్టరీ ఉన్నవారు.  ఈ నాలుగు క్యాటగిరిల్లో ఎవరికి ముందు ప్రయారిటి ఇవ్వాలన్నదే ప్రధాన సమస్య అయిపోయింది. అన్నీ క్యాటగిరీల రోగులకు వైద్యం అందించటానికి  కావాల్సిన సౌకర్యాలుంటే అసలు సమస్యే లేదు.

 

అందుకనే అన్నీ విషయాలు ఆలోచించుకుని పై నాలుగు క్యాటగిరీల్లోని రోగుల్లో బతికే అవకాశాలు ఎవరికి ఉన్నాయనే విషయాన్ని ముందుగా పరీక్షిస్తారు. బతికే అవకాశం ఎవరికుంటే వారినే ఆసుపత్రుల్లో చేర్చుకుని మిగిలిన వాళ్ళకు చికిత్స చేసేసి తిరిగి పంపేస్తున్నారు. మరి బయటకు పంపేసిన రోగుల పరిస్ధితి ఏమిటి ? ఏమిటంటే దైవం మీద భారమేయటమే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: