ప్రస్తుతం ప్ర‌పంచ‌మంతా గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా వైర‌స్ సోకింద‌ని తెలిస్తే చాలు ఆ ఛాయ‌ల‌కు కూడా వెళ్ళ‌డానికి భ‌య‌ప‌డిపోతున్న విష‌యం తెలిసిందే. కానీ వీటిని కూడా క్యాష్ చేసుకుంటున్నారు కొంత మంది కిలాడి దొంగ‌లు. ఏకంగా కరోనా పాజిటివ్ వచ్చి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ఇళ్లనేక‌రెక్ట్‌గా టార్గెట్ చేశారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారించిన వ్యక్తి కుటుంబ సభ్యులను, అతను కలిసిన వ్యక్తులను కూడా ప్ర‌భుత్వం క్వారంటైన్‌కి పంపించడం కూడా వారికి బాగా కలిసొచ్చింది. దీంతో ఇంట్లో ఎవరూ లేరని పక్కాగా తెలియడంతో తాపీగా వచ్చి సైలెంట్‌గా పని పూర్తి చేసుకెళ్లారు.

 

ఈ విష‌యాన్ని చుట్టుప‌క్క‌ల ఉన్న‌వాళ్ళు గ‌మ‌నించారు. ఇంటి బ‌య‌ట ప‌డి ఉన్న సూట్‌కేసుల‌ను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అస‌లు అస్క‌డ కరోనా కేసు ఉంద‌ని తెలియ‌డంతో.. అయినా కూడా భయపడకుండా ఇంటిని లూటీ చేసిన ఆశ్చర్యకర ఘటన జమ్మూ కశ్మీర్‌లో చోటుచేసుకుంది. ఉత్తర కశ్మీర్‌కి చెందిన ఇద్దరు వ్యక్తులకు కరోనా పాజిటివ్ అని తేలింది. వారిని శ్రీనగర్‌లోని స్కిమ్స్ ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

 

 ఇలా ఓ ప్ర‌క్క ఈ వ్యాధిసోకి దేవుడా అని ప్రాణాపాయ స్థితిలో వారు ఇబ్బందులు ప‌డుతుంటే కరోనా పాజిటివ్‌ వ్యక్తుల కుటుంబ సభ్యులను కూడా అధికారులు క్వారంటైన్‌కు తరలించడంతో ఆ రెండు ఇళ్లలో ఎవరూ లేర‌ని గ‌మ‌నించిన దొంగ‌ల ముఠా ఈ అఘాయిత్యానికి పాల్ప‌డ్డారు.. ఇదే అదనుగా భావించిన దొంగలు కిటికీలు పగలగొట్టి మ‌రీ  ఇళ్ళ‌లోకి చొరబడి బంగారు ఆభరణాల సహా విలువైన వస్తువులను దొంగిలించినట్లు తెలుస్తోంది. చుట్టుప‌క్క‌ల వారు ఇచ్చిన స‌మాచారంప్ర‌కారం పోలీసులు కేసును న‌మోదు చేసుకుని దర్యాప్తు చేప‌ట్టారు. దొంగలను గుర్తించేందుకు ఫోరెన్సిక్, మెడికల్ టీమ్‌లను పోలీసులు రంగంలోకి దింపారు. అయితే ఇది ఇంటి ద‌గ్గ‌ర‌ దొంగల పని అయి ఉంటుందని.. లేదా  ఆ కుటుంబ స‌భ్యుల‌కు బాగా తెలిసిన వారి పనేనని ఉంటుంద‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: