క‌రోనా వైర‌స్(కోవిడ్‌-19)..  ప్రపంచంలోని అనేక దేశాల్లో విజృంభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా క‌రోనా బాధితుల సంఖ్య 7.85 లక్షలు దాటగా, గత 24 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా 3వేల మంది మృతిచెందారు. ఇక ఈ మ‌హ‌మ్మారి వైరస్ నిర్ధారణ అయినవారిలో 1,65,000 మంది కోలుకుంటే.. మరో 5.52 లక్షల మందిలో స్వల్పంగా లక్షణాలు ఉన్నాయి. ఈ ర‌క్క‌సి భార‌త్‌లోనూ వేగాన్ని పెంచుకుంటుంది. ఇక్క‌డ రోజురోజుకు క‌రోనా కేసులు పెరుగుతుండ‌డంతో భారత ప్రభుత్వం 21రోజుల లాక్ డౌన్ ప్రకటించింది. ఈ క్ర‌మంలోనే మ‌ద్యం షాపులు కూడా మూత‌ప‌డ్డాయి. అయితే కరోనా వైరస్ మందుబాబులకు కష్టాలు తెచ్చిపెట్టింది. 

 

గత కొన్ని రోజులుగా మద్యం అందుబాటులో లేక విలవిలలాడుతున్నారు. వీరి బలహీనతను ఆసరాగా చేసుకుని బెల్ట్ షాపులు అందినకాడికి దోచేస్తున్నారు. అసలే మద్యం లభించని ఈ సమయంలో దొరికింది అమృతంగా భావించి మద్యంప్రియులు కొనుగోలు చేస్తున్నారు. కొందరేమో ఆ ధరలను చూసి బెంబేలెత్తిపోతు న్నారు. వైన్స్‌ దుకాణాలు మూసి వేసి ఉండడాన్ని ఆసరాగా చేసుకున్న బెల్టుషాపుల నిర్వాహకులు ఇష్టానుసారంగా మద్యం విక్రయాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే రూ.120కి వచ్చే క్వార్టర్ మందును రూ.300 నుంచి రూ400 వరకు విక్రయిస్తున్నారు. 

 

దీంతో మద్యంప్రియులు తప్పని పరిస్థితుల్లో అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారు. అయితే మద్యం దుకాణాదారులు ఒక దగ్గర దాచిఉంచి బెల్టు దుకాణాల నిర్వాహకులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారని తెలుస్తోంది. మ‌రి ఇంత జరుగుతున్నా దీన్ని కట్టడి చేయాల్సిన ఎక్సైజ్‌ అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు వైన్స్ షాపు ఓనర్స్, బెల్ట్ షాపు నిర్వాహకులతో ఎక్సైజ్ అధికారులు కుమ్మక్కయ్యారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ క్ర‌మంలోనే దీనిపై ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని ప్రజాసంఘాలు కోరుతున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: