ప్రస్తుతం మనదేశంలో కోవిడ్-19 వేగంగా వ్యాప్తిస్తున్నందున వీలైనంత ఎక్కువమందికి కరోనా టెస్టు చేయాల్సిన అవసరం ఉంది. కరోనా లక్షణాలు కనిపించిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలి. ముందుగా జాగ్రత్త పడకపోతే, దాన్ని ఆపడం చాలా కష్టం. కానీ ఎక్కువ మందికి ఒకేసారి పరీక్ష చేయడం కొంచెం కష్టమని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకోసమే కరోనావైరస్ టెస్టులను ఇకపై ఆన్ లైన్ లోనే బుక్ చేసుకునే సదుపాయాన్ని అందించబోతున్నారు. ప్రముఖ మెడికల్ ప్లాట్ ఫాం ప్రాక్టో ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతానికి ముంబైలోనే అందుబాటులో ఉన్న ఈ సేవలను త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు.

 

 

వివరాల్లోకి వెళ్తే, ప్రముఖ మెడికల్ ప్లాట్ ఫాం ప్రాక్టో ఇకపై కోవిడ్-19 టెస్టులను కూడా నిర్వహించనుంది. ఈ మేరకు కంపెనీ ఒక ప్రకటనను కూడా విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ల అనుమతులను కూడా ప్రాక్టో పొందింది. ఈ టెస్టులను నిర్వహించడానికి థైరోకేర్ తో ఒప్పందం కూడా  కుదుర్చుకుంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్, ఫిజీషియన్ సంతకం చేసిన టెస్ట్ ఫారం, ఫొటో ఐడీ కార్డులను టెస్టు సమయంలో సమర్పించాలని ప్రకటనలో తెలిపారు.

 

 

ఈ ఆన్ లైన్ బుకింగ్స్ ద్వారా హాస్పిటల్స్ లో ఉండే రద్దీ తగ్గుతుంది. కరోనా టెస్టును బుక్ చేసుకోవడానికి రూ.4,500 ఖర్చు అవుతుంది. https://www.practo.com/covid-test, https://covid.thyrocare.com/ వెబ్ సైట్ల ద్వారా ఈ టెస్టును ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చని ప్రాక్టో తెలిపింది. అత్యంత నైపుణ్యం ఉన్న వైద్యులు నేరుగా ఇంటికి వచ్చి మీ శాంపిల్స్ ను సేకరిస్తారని పేర్కొంది. శాంపిల్స్ తీసుకునేటప్పుడు ఐసీఎంఆర్ నియమాలన్నిటినీ వారు పాటిస్తారని తెలిపింది. తర్వాత 24 నుంచి 48 గంటల్లో దీనికి సంబంధించిన ఫలితాలను పేషెంట్లు ప్రాక్టో వెబ్ సైట్లో చూసుకోవచ్చని ప్రకటనలో స్పష్టంగా వివరించింది. వేగంగా వ్యాపిస్తున్న ఈ వైరస్ వల్ల వీలైనంత ఎక్కువమందికి ఈ టెస్టు చేయాల్సిన అవసరం ఉందని ప్రాక్టో చీఫ్ హెల్త్ స్ట్రాటజీ ఆఫీసర్ అలెగ్జాండర్ కురువిల్లా తెలిపారు. వ్యాధి లక్షణాలు కనిపించిన ప్రతి ఒక్కరికీ దీనికి సంబంధించిన టెస్టులు జరిగేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: