ఏపీలోని ప్ర‌కాశం జిల్లాలో క‌రోనా వైర‌స్ జోరుగా విజృంభించింది. నిన్న‌టి వ‌ర‌కు ఈ జిల్లాలో మూడు పాజిటివ్ కేసులు ఉండ‌డంతో అంద‌రూ ఒక్క‌సారిగా షాక్ అయ్యారు. చీరాల ప‌రిస‌ర ప్రాంతాల్లో ఈ కేసులు న‌మోదు అవ్వ‌డంతో ఈ ప్రాంతాన్ని పోలీసులు రెడ్ జోన్‌గా ప్ర‌క‌టించారు. ఇక మంగ‌ళ‌వారం ఉద‌యం ఏకంగా 8 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. వీరంతా కూడా ఢిల్లీ వెళ్లి వ‌చ్చిన వారే కావ‌డం విశేషం. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జ‌రిగిన ప్ర‌త్యేక ప్రార్థ‌న‌ల కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున ప్ర‌జ‌లు అక్క‌డ‌కు త‌రలి వెళ్లారు.

 

ఈ క్ర‌మంలోనే అక్క‌డ దేశ‌, విదేశాల నుంచి కూడా మ‌త ప్ర‌బోధ‌కులు హాజ‌ర‌య్యారు. ఈ క్ర‌మంలోనే అక్క‌డ‌కు ప్రార్థ‌న‌ల కోసం వెల్లిన వారికి సైతం క‌రోనా పాజిటివ్ సోకింది. ఈ ఒక్క రోజే ఏకంగా 8 పాజిటివ్ కేసులు న‌మోదు కావ‌డంతో టోట‌ల్‌గా ప్ర‌కాశం జిల్లా ప్ర‌జ‌ల్లో తీవ్ర ఆందోళ‌న క‌ర ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. జిల్లాలో రెడ్ అలెర్ట్ ప్ర‌క‌టించారు. పోలీసులు ప్ర‌జ‌ల‌ను అస్స‌లు బ‌య‌ట‌కు రానియ్య‌డం లేదు. ఎవ‌రికి అయితే క‌రోనా సోకిందో వారు క‌లిసిన వారు అంద‌రిని క్వారైంటైన్‌కు త‌ర‌లిస్తున్నారు.

 

క్వారంటైన్లో ఉన్న వారు - 30 + వేలు

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: