దేశం వ్యాప్తంగా కరోనాని అరికట్టడానికి లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో  ప్రజలంతా ఇంటి పట్టునే ఉండాలని.. బయటకి రావొద్దని.. వస్తే కరోనా వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం ఓ వైపు చెబుతున్నా.. కొంత మంది నిర్లక్ష్యంగా వ్యవహరిన్నారు.  ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు .. ఈ నెల 13నుంచి 15వ తేదీ మధ్య ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలో మతపరమైన ప్రార్ధనల్లో పాల్గొన్న కొందరికి కరోనా సోకిందని, వారిలో తెలంగాణ కు చెందిన వారు కూడా ఉన్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. 

 

తెలంగాణ  నుంచి మర్కజ్ ప్రార్థనకు వెళ్లినవారు :  హైదరాబాద్ 186,  మెదక్ 26, వరంగల్ 25, నల్గొండ 21, నిజామాబాద్ 18, కరీంనగర్ 17,  రంగారెడ్డి 15, ఖమ్మం 15 , నిర్మల్ 11, భైంసా 11, ఆదిలాబాద్ 10. అయితే  ఢిల్లీ వెళ్లి వచ్చినవారు వెంటనే తమ వివరాలను వెల్లడించాలని తెలంగాణ సీఎంవో కోరింది. వారికి ఉచితంగా టెస్టుల చేయించి, వైద్య సాయం అందిస్తామని ప్రకటించింది.   

 

అంతే కాదు మార్చి 10న జరిగిన మతపరమైన ప్రార్ధనల్లో పాల్గొనేందుకు మలేషియా, ఇండోనేషియా, సౌదీ అరేబియా, కిర్గిస్తాన్‌ తో పాటు పలు దేశాలకు చెందిన మత ప్రచారకులు హాజరయ్యారు.  ఇదిలా ఉంటే కరోనా వైరస్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది కేంద్రప్రభుత్వం. అయితే ఈ లాక్ డౌన్ ను ఉల్లంఘిస్తూ మతపరమైన కార్యక్రమాలు చేపట్టినందుకు ఢిల్లీ పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: