ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా  వైరస్ కోరలు చాస్తూ ఎంతో మందిని బలి తీసుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రపంచ దేశాలు మొత్తం కరోనా వైరస్ పైనే పోరాటం చేస్తున్నాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా వైరస్ విజృంభన మాత్రం ఆగడం లేదు. ఈ కరోనా  వైరస్ ఎఫెక్ట్ అన్ని రంగాల్లో పడడం వల్ల అటు క్రీడా సినిమా రంగాలతో పాటు పలు రంగాల్లో కూడా పాక్షికంగా మూత పడిన విషయం తెలిసిందే. సినిమా షూటింగ్ లోనే ఎక్కడికక్కడ ఆగిపోగా అటు క్రీడలు కూడా ఆగిపోయాయి. అయితే కరోనా వైరస్ ప్రపంచ దేశాలను కలవరపడుతున్నపటికీ... ఆరిజోనా క్లబ్ లో  ఆరంభమైన గోల్ఫ్ లీగ్ ను నిర్వహిస్తున్నారు. 

 

 

 ఎన్నో ముందస్తు జాగ్రత్తలతో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అక్కడికి వచ్చిన వారు ఎవరు కరోనా  వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ లీగ్ ను నిర్వహిస్తున్నారు. కేవలం ఇద్దరికీ మాత్రమే అనుమతి ఇస్తున్నారు నిర్వాహకులు. అయితే కరోనా  వైరస్ ప్రభావం రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో... అమెరికాలో టాయిలెట్ పేపర్ లకు భారీ డిమాండ్ ఏర్పడింది విషయం తెలిసిందే. ఇక అమెరికాలో టాయిలెట్ పేపర్ లకు ఉన్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని గోల్ఫ్ లీగ్ లో విజేతలకు ఆరిజోనా క్లబ్ నిర్వాహకులు టాయిలెట్ పేపర్ లతో పాటు నగదు బహుమతిని కూడా ఇస్తున్నారు. 

 

 

 అయితే మొదట ఈ టాయిలెట్ పేపర్ ను బహుమతిగా అందుకున్న గోల్ఫ్ విజేత ఆశ్చర్యపోయారు. గత వారం జరిగిన గోల్ఫ్ లీగ్ పోటీలో సారా విజేతగా నిలిచింది. ఈ పోటీలో గెలిచినందుకు గాను ఆమెకు 2800 యుఎస్  డాలర్లతో పాటు... టాయిలెట్ పేపర్ ని కూడా బహుమతిగా అందించారు నిర్వాహకులు. అయితే టాయిలెట్ పేపర్ బహుమతిగా రావడంపై సారా  ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. తనకు నగదూతో  పాటు టాయిలెట్ పేపర్ లు బహుమతిగా ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగించింది అంటూ తెలిపిన సారా .. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కోర్టు లోని గుంతల్లో సబ్బు నురగ నింపుతున్నారని... దీనివల్ల బంతిని సురక్షితంగా తీసుకోగలుగుతున్నాం  అంటూ తెలిపారు. కరోనా  వైరస్ కారణంగా ఎక్కడ క్రీడలు జరగడం లేదని కానీ ఇక్కడ మాకు పోటీ పడే అవకాశం లభించినందుకు ఎంతో ఆనందంగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది సారా.

మరింత సమాచారం తెలుసుకోండి: