ప్రస్తుతం ప్రపంచాన్ని ఏదైనా వైరస్ వణికిస్తోంది అంటే అది కరోనా వైరస్ అనే చెప్పాలి. ఈ కరోనా వైరస్ రోజు రోజుకు పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు.. ఈ కరోనా దాడి ఒక్క మన దేశంలోనే కాదు ప్రపంచదేశాల్లో ఈ కరోనా వైరస్ వ్యాపిస్తుంది. చెప్పాలి అంతే మన దేశంలో చాలా తక్కువగా ఉంది అనే చెప్పాలి.. 

 

అమెరికా.. ఇటలీ.. ఇరాన్.. స్పెయిన్ వంటి దేశాల్లో ఈ కరోనా వైరస్ కారణంగా రోజుకు కొన్ని వేలమంది మృతి చెందుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఇటలీలో కరోనా వైరస్ మరణాలు ఎక్కువ సంఖ్యలో నమోదవుతే.. అమెరికాలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య ఎక్కువగా నమోదవుతుంది. ఇంకా అలా మన దేశంలో అవ్వకూడదు అనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం 21 రోజులు పాటు లాక్ డౌన్ విధించింది. 

 

ఇంకా కేంద్ర లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలంతా కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. అయితే ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ కరోనా వైరస్ పరీక్షలు ఎలా చేస్తారో తెలుసా? కరోనా పాజిటివ్ ఆ ? నెగటివ్ ఆ అనేది ఇలా తెలుసుకుంటారు. ఇంకా కరోనా వైరస్ ను గుర్తించే పరీక్ష విధానాన్ని ''రివర్స్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌ క్వారెంటేటివ్‌ పాలిమెరేజ్‌ చైన్‌ రియాక్షన్‌'' అని అంటారు. 

 

ఈ పరీక్ష కోసం కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వ్యక్తి ముక్కు, గొంతు నుంచి ‘శ్వాబ్‌’/నమూనాను సేకరించి, ల్యాబ్‌కు పంపిస్తారు. అక్కడ ''రివర్స్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌'' ద్వారా, వైరస్‌ ఆర్‌.ఎన్‌.ఎ అంటే రైబోన్యూక్లియక్‌ యాసిడ్‌ ను డి.ఎన్‌.ఎగా మార్చి, అందులో కొంత భాగాన్ని లక్ష్యంగా చేసుకుని, సూక్ష్మంగా పరీక్షలు నిర్వహిస్తారు. 

 

ఆతరవాత లక్ష్యంగా చేసుకున్న కొంత భాగం పరీక్షలో కొంత వెలుగును విరజిమ్ముతుంది. ఈ వెలుగు తీవ్రతను కంప్యూటరు రికార్డు చేస్తుంది. ఈ ఫలితాన్ని పాజిటివ్‌, నెగటివ్‌ శాంపిళ్లతో పోల్చి చూస్తారు. పాజిటివ్‌ శ్యాంపిల్‌ అయిన పక్షంలో, దాన్ని నెగటివ్‌ శ్యాంపిల్‌తో సరి పోల్చి చూస్తే అది ఎక్కువగా వెలుగును విరజిమ్ముతుంది. 

 

అయితే వైరస్‌ రూపం మార్చుకోవడం వల్ల తప్పుడు ఫలితం వచ్చే ప్రమాదం ఎక్కువ ఉండటం వల్ల నూటికి నూరు శాతం నిజమైన ఫలితం రావడం కోసం శాస్త్రవేత్తలు ఒకటికి మించి ఎక్కువ టెస్ట్‌ కిట్స్‌ను ఉపయోగించి, శ్యాంపిళ్లను పరీక్షిస్తారు. ఇలా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: