ప్రస్తుతం భారతదేశంలో కరోనా మరణాలు మెల్లమెల్లగా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కాజ్‌లో మత పరమైన ప్రార్థనల్లో పాల్గొన్న ఆరుగురు కరోనా వైరస్‌తో మృతి చెందారు. ఈ విషయం ఇప్పుడు దేశమంతటా కలకలం రేపుతోంది. శనివారం నాంపల్లికి చెందిన 74 ఏళ్ల వృద్ధుడు చనిపోయిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే అధికారులు అప్రమత్తమై హాజరైన వారి వివరాలు సేకరించారు. మత ప్రార్థనల్లో పాల్గొనేందుకు ఏపీ, తెలంగాణ నుంచి భారీగా వెళ్లడంతో అతను ఎవరెవరితో కలిశారు? వారి పరిస్థితి ఏంటి? అని అధికారులు వివరాలను సేకరిస్తున్నారు. ఇటు ఏపీలో కూడా ముగ్గురు మృతి చెందారు. వారు కూడా ఇటీవల ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారే.

 

 

తాజాగా విజయవాడకు చెందిన ఒక మహిళ ఆదివారం నాడు మృతి చెందగా, ఆమె భర్త మరుసటి రోజు సోమవారం మృతి చెందాడు. వీళ్ళిద్దరూ కూడా ఇటీవల ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి రావడంతో కరోనా వైరస్ సోకి చనిపోయారనే అనుమానం కలుగుతోంది. జమాత్‌కు ఏపీ నుండి 50 మంది వరకు, తెలంగాణ నుండి 40 మంది వెళ్లినట్టు పోలీసులు తెలిపారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. అతను కూడా ఢిల్లీలో జరిగిన మత సమావేశానికి హాజరైనట్టు పోలీసులు గుర్తించారు. అతను సన్నిహితంగా మెలిగిన వారితో పాటు, కుటుంబసభ్యులకు కూడా పరీక్షలు చేశారు. అతనితోపాటు మరో 39 మంది కూడా నిజామాబాద్ జిల్లా నుంచి ఆ సమావేశానికి హాజరైనట్టు తెలిసింది. వారిని పరీక్షించిన ఆర్ఎంపీ డాక్టర్ తో సహా 40 మంది రక్త నమునాలను గాంధీ ఆస్పత్రికి పంపించారు. ఎందుకైనా మంచిదని 25 మందిని క్వారంటైన్‌కు కూడా తరలించారు. మిగిలిన వారిని కూడా పోలీసులు త్వరగా పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు.  

 

ఏపీలో కూడా జమాత్‌కు వెళ్లిన వారి కోసం అన్వేషణ మొదలయ్యింది. పశ్చిమగోదావరి జిల్లాలో 11 మందిని గుర్తించారు. విజయనగరంలో 12 మందిని, రాజమండ్రిలో కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఉరవకొండ, వజ్రకరూర్‌కి చెందిన ఐదుగురిని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలో కూడా సోదాలు కొనసాగుతోన్నాయి. అందుకు సంబందించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: