ప్రపంచంలో ఎక్కడ చుసిన  ప్రస్తుతం  కరోనా మరణ మృదంగం మోగుతుంది. అలాగే  కరోనా  వాళ్ళ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీని వాళ్ళ అన్ని రంగాలలో చాలా ఇబ్బందులు ఎదురుఅవుతున్నాయి.  ఇది ఇలా ఉండగా మార్కెట్లో  శానిటైజర్లకు  మంచి డిమాండ్ ఉంది. మార్కెట్ డిమాండ్తో కొన్ని ప్రాంతాలలో అధిక  ధరలకు శానిటైజర్లు  అమ్మడం మొదలు పెట్టారు. ఇలాంటి తరుణంలో ప్రజలకు ప్రముఖ సంస్థ పతంజలి ఆయుర్వేద్ ఒక మంచి శుభవార్త తెలియ చేసింది. ఆ శుభవార్త ఏమనగా మార్కెట్లోకి  రూ.1 కే శానిటైజర్ అందుబాటులోకి  తీసుకొని రాబోతుంది. ఇందులో ప్రముఖ షాంపు తయారీ కంపెనీ కెవిన్‌కేర్ సంస్థ కూడా భాగస్వామి అయ్యింది. ఇలా మార్కెట్లోకి తీసుకోని రావడానికి ముఖ్య ఉద్యేశం మార్కెట్ వాటా లక్ష్యం అని సంస్థలు భావిస్తున్నాయి. ఈ కారణంతో ప్రజలకు తగ్గువా ధరకు శానిటైజర్‌ ను తీసుకురావాలని  నిర్ణయం తీసుకోవడం జరిగింది. 

 


 

ప్రముఖ నైల్, చిక్ బ్రాండ్లను తయారు చేసేటి కెవిన్‌ కేర్ ఇప్పుడు ముందుకొచ్చి కేవలం ఒక్క రూపాయికే శానిటైజర్ ని తీసుకువస్తామని సంస్థ ప్రకటించింది. అయితే ఈ ప్రాడక్టుని చిక్ బ్రాండ్ కింద దీన్ని తీసుక రాబోతున్నారు. కాకపోతే 2 ఎంఎల్ ని మాత్రమే చిన్న ప్యాకేట్‌ ను రూ.1 గా విడుదల చేయబోతుంది. ఇది రెండు సార్లు పనికి వస్తుంది. ఇంతేకాకుండా అతి తక్కువ ధరలో 10 ML, 50 ML, 90 ml, 400 ML, 800 ML, 5 Lr పరిమాణాల్లో కూడా శానిటైజర్లు అందుబాటులో ఉంటాయని కంపెనీ చెప్పుకొచ్చింది.

 


అయితే ప్రాంచంలో సర్వే చేసే నీల్సన్ నివేదిక ప్రకారం, హ్యాండ్ శానిటైజర్లు అమ్మకాలు గత రెండు నెలల్లో భారీగా ఊపందుకున్నాయి. నిజానికి హ్యాండ్ శానిటైజర్ల అమ్మకాలు ఒక్క ఫిబ్రవరి నెలలోనే ఏకంగా 53% పెరగడం చూడవచ్చు. మాములుగా వీటి అమ్మకాల్లో సగటు నెలకి పెరుగుదల 11% గానే ఉండేది. వీటితోపాటు ఫ్లోర్ క్లీనర్స్, టాయిలెట్ క్లీనర్స్ అమ్మకాలు కూడా గత నెలలో అమ్మకాలు చెప్పుకోతగ్గ పరిమాణంలో అమ్మకాలు పెరిగాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: