ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ ఒక్క రోజే 17 కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇటీవల ఢిల్లీ మత ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వారికి కరోనా పాజిటివ్ గా తేలింది అని అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు 23 గా ఉన్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా 17 పెరిగి 40కి చేరుకుంది. ఇటీవల ఢిల్లీ లో తెలంగాణా ఆంధ్రప్రదేశ్ కి చెందిన దాదాపు 800 మంది మత ప్రార్ధనలలో పాల్గొన్నారు. 

 

వారిలో ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారు దాదాపు 200 మందికి పైగా ఉన్నారు. ఇప్పటి వరకు ఏపీలో కట్టడిలో ఉన్న కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీనితో అలజడి రేగింది. దీనితో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు అందరూ కూడా ఇప్పుడు ఇళ్ళ నుంచి బయటకు రావాలి అంటేనే భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది. కరోనా ఒక్కసారిగా రెచ్చిపోవడంతో ఏపీ సిఎం జగన్ కేంద్రంతో మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. 

 

ఢిల్లీ మత ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వారు కృష్ణా, గుంటూరు, అనంతపురం, సహా పలు ప్రాంతాల్లో ఇష్టం వచ్చినట్టు తిరిగారు. ప్రకాశం జిల్లా చీరాల, ఒంగోలు ప్రాంతాల్లో కూడా వారు తిరిగారు. 17 మందిలో ఎనిమిది మంది ప్రకాశం జిల్లా, అనంతపురానికి చెందిన వారు ఇద్దరు, ఐదుగురు గుంటూరు, ఒకరు కృష్ణా జిల్లా వాసి, మరొకరు తూర్పు గోదావరికి చెందిన వారు ఉన్నారు. ప్రకాశం జిల్లా కేసుల్లో ఐదుగురు చీరాలకు చెందిన వారు.

మరింత సమాచారం తెలుసుకోండి: