కరోనా ఈ మనుషుల మీద కక్ష కట్టినట్లుగా ఉంది.. ఇప్పటికే కొన్ని నగరాలను తుడిచిపెడుతుండగా, ప్రపంచ దేశాలు కోలుకోలేని విధంగా ఆర్ధిక మాంధ్యమాన్ని సృష్టించింది.. ఈ వైరస్ ధాటికి కొందరు నరకాన్ని అనుభవిస్తూ మరణిస్తుండగా, బ్రతికి ఉన్నవారు, కరోనా రోగులకు సేవచేస్తున్నవారు అనుభవిస్తున్న బాధా నరకం ఎన్నో పాపాలు చేసిన వాడు కూడా అనుభవించడు కావచ్చూ.. ఇక ఈ కరోనా వల్ల ఆకలిచావులు కూడా అక్కడక్కడ సంభవిస్తున్నాయి.. ముఖ్యంగా విదేశాల్లో అయితే జరుగుతున్న నష్టాన్ని చూస్తుంటే గుండె బరువెక్కుతుంది..

 

 

ఇక కొందరు వైరస్ మూలంగా చనిపోతుంటే.. మరికొందరు భయంతో ఏదేదో ఊహించుకుని బలవంతగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. అయితే కరోనా వల్ల ఇటలీ ఎంతగా నష్టపోయిందో అందరికి తెలిసిందే.. ప్రస్తుతం అమెరికా కూడా అధికంగా నష్టపోతుంది.. మరణాన్ని జయించే దిశగా ప్రయోగాలు చేస్తున్న మానవునికి.. కరోనా వైరస్‌కు మందు కనిపెట్టడం ఎంత కష్టతరంగా మారిందో అర్ధం అవుతుంది.. ఇన్ని నెలలు గడిచినా ఇప్పటి వరకు ఈ వైరస్‌కు ఔషదాన్ని కనుగొనలేక పోయాడు మేధావి అని చెప్పుకుంటున్న మనిషి..

 

 

ఇకపోతే కరోనా దెబ్బకి అమెరికా దేశంలోని న్యూయార్క్ నగరంలో వైద్య వాలంటీర్ల కొరత తీవ్రంగా ఏర్పడిందట.. రోజురోజుకు కరోనా వైరస్ సోకిన రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో తమకు వైద్య వాలంటీర్లు కావాలని విజ్ఞప్తి చేశారు. ‘‘దయచేసి మాకు సహాయం చేయండి’’ అంటూ న్యూయార్క్ గవర్నర్ వైద్య కార్మికులను వేడుకున్నారు. ఎక్కడున్న మనుషులు మనుషులే.. మన ఇండియాకు ఇలాంటి పరిస్దితి వస్తే జరిగే ప్రమాదాన్ని ఊహించాలంటేనే ఒళ్లు కంపించిపోతుంది..

 

 

అలాంటిది అందమైన న్యూయార్క్ నగరంలో కరోనా రోగుల సంఖ్య భవిష్యత్ లో గణనీయంగా పెరుగుతుందని వైద్యాధికారులు హెచ్చరిస్తుంటే జాలి గుణం ఉన్న ప్రతివారి మనసు విలవిలలాడక తప్పదు.. ఇలాంటి క్లిష్ట సమయంలో  న్యూయార్క్ గవర్నరు ప్రజల కోసం వైద్య వాలంటీర్లను వేడుకోవడం చూస్తుంటేనే అర్ధం అవుతుంది అక్కడి పరిస్దితి.. ఇక అమెరికాలో కరోనా వైరస్ కు కేంద్రస్థానంగా మారిన న్యూయార్క్‌లో ప్రతీ గంట గంటకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇక ముందు ముందు అమెరికా పరిస్దితి ఏంటో అర్ధం అవకుండా తయారవుతుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: