ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో ఒక్కసారిగా కరోనా కలకలం చెలరేగింది. ఆ ప్రాంతం మాత్రమే కాదు.. అక్క‌డ జ‌రిగిన‌ ఓ మత కార్యక్రమం నేడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మార్చి 1-18 మధ్య దేశ రాజధాని ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో ఉన్న 'మర్కాజ్‌' మసీదులో జరిగిన ఓ మత సంబంధిత కార్యక్రమానికి హాజరైన వివిధ రాష్ట్రాల వారికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు తేలడంతో తీవ్ర భయాందోళన వ్యక్తమవుతోంది. ఏపీ, తెలంగాణలో ‘కరోనా పాజిటివ్‌’గా తేలిన వారిలో చాలామంది ఢిల్లీలో జరిగిన సదరు మత సదస్సుకు హాజరైన వారే. 

 

అలాగే తెలంగాణలో ఏకంగా ఆరుగురు కరోనాతో చనిపోవడం, ఆ ఆరుగురూ ఢిల్లీలో మర్కజ్‌లో ప్రార్థనల కోసం వెళ్లిన వారే కావడం ఆందోళన కలిగిస్తోంది. మ‌రియు పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరగడానికి ఇదే కారణం అంటున్నారు.  విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల ద్వారా వీరిలో పలువురికి కరోనా వైరస్‌ సోకినట్టు ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో ఇవాళ ఒకేసారి 1600 మందిని క్వారెంటైన్‌కు తరలించారు. వీరిలో 11 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు. 300 మంది వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ఉన్నారు.

 

మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారికి కరోనా వైరస్ సోకినట్లు తేలడంతో ఏపీ, తెలంగాణ‌ ప్రభుత్వాలు అలర్ట్ అయ్యింది. అక్కడికి వెళ్లొచ్చిన వారిపై దృష్టి చేసింది. ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతొక్కరి సమాచారాన్ని సేకరిస్తోంది. వారికి పరీక్షలు నిర్వహించి, ఉచితంగా చికిత్స అందచేందుకు సిద్ధమైంది. ఇప్పటికే కొందర్ని ఐసోలేషన్ వార్డులకు తరలించారు. కాగా, నిజాముద్దీన్ దర్గా, చుట్టు పక్కల ప్రాంతంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు.. ఆ ప్రాంతాన్ని సీజ్ చేసి, ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితి పై వాకబు చేశారు. దర్గాలో జరిగిన సమావేశంలో పాల్గొన్న వారందరినీ బస్సులలో క్వారెంటైన్‌కు తరలించారు. ఏదేమైనా ఓ మత కార్యక్రమం 1600 మందిని రిస్క్‌లో ప‌డేసింది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: