కరోనా యావత్ ప్రపంచాన్ని తలక్రిందులు చేస్తోంది. మన ఇండియాలో కూడా... రోజు రోజుకీ పెరిగిన కరోనా వైరస్ కేసులు.. జనులను విపరీతమైన ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ఇలా లాక్ డౌన్ పరిస్థితితో కొన్ని చోట్ల శాంతికి భంగం కలుగుతుండటం మనం చుస్తువున్నాం. ఇలాంటి పరిస్థితులలో... పద్మభూషణ్ గ్రహీత డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి... కరోనా వైరస్‌పై చెప్పిన విషయాలు, మన ఇరు తెలుగు రాష్ట్రాల వారిని కొంత ఊరటను చేకూర్చాయి.

 

కరోనా వైరస్ ప్రాబల్యం విషయంలో ఆయన కొన్ని ముఖ్యమైన విషయాలు పేర్కొన్నారు. అదేమంటే... వచ్చే నెల రోజుల్లోపల కరోనా వైరస్‌ని ఇండియా ఖచ్చితంగా పారద్రోలగలదని... ఆయన ఎంతో నమ్మకంగా చెప్పడం ఇపుడు అందరిలో భయ భ్రాంతులు పటాపంచలు అయిపోయాయి. కానీ అదే టైములో పెరుగుతున్న కరోనా కేసులు కలవర పెడుతున్న మాట కూడా వాస్తవమే...

 

డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారు... ప్రస్తుతం ఆసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటెరాలజీ ఛైర్మన్‌గా ఉన్నసంగతి అందరికి తెలిసినదే. కరోనా విషయంలో వివిధ దేశాలను మన దేశంతో సరి పోల్చుతూ.. అలాగే ఇక్కడి వాతావరణాన్ని, అంటే ప్రస్తుతం ఇక్కడ ఎండలు ఎక్కువగా ఉండటం.. ఉష్ణోగ్రత స్థాయిలు హెచ్చు స్థాయిలో ఉండటం.. వంటి విషయాలను దృష్టిలో ఉంచుకొని... ఇక్కడి వాతావరణంలో కరోనా బలహీన పడుతుందని... క్రమంగా కేసులు కూడా తగ్గుముఖం పడతాయని చెప్పుకొచ్చారు.

 

ఇంకా అయన ప్రస్తావిస్తూ... ఇటలీలో ఉన్న కరోనా వైరస్‌కీ, మన భారత్ లో ఉన్న కరోనా వైరస్‌కీ జన్యుపరంగా కొంచెం తేడా ఉందని.. మన వాతావరణంలో రాగానే కరోనా వైరస్ బలహీనపడిందనీ, అందులో జన్యుపరమైన మార్పులు (మ్యుటేషన్) జరిగాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఇది ఇక్కడ వారిపట్ల వరంగా మారిందని... అయినా సరే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన చర్యలను మన విధిగా పాటించాలని, వీలైనంత త్వరగా కరోనాను దేశం నుండి పారద్రోలాలని... సూచించారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple: https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: