కరోనా వైరస్ తగ్గినట్టే తగ్గి మళ్ళీ చెలరేగిపోతుంది. ఊహించని విధంగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ఎన్ని చర్యలు చేపట్టినా సరే కరోనా మాత్రం కట్టడి అవ్వడం లేదు. ప్రతీ గంటా కూడా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య ఏడు లక్షల 80 వేలకు చేరింది. వీరిలో 5 లక్షల 80 వేల మందికి కరోనా నయం అవ్వలేదు. రెండు లక్షల మందికి కరోనా అదుపులోకి వచ్చింది. 

 

అమెరికాలో కరోనా కేసుల సంఖ్య ఒక లక్షా 64 వేలకు చేరుకుంది. ఇటలీలో ఒక లక్షా వెయ్యి మందికి కరోనా వైరస్ సోకింది. స్పెయిన్ లో 81 వేల మందికి కరోనా సోకింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు 40 వేలకు దగ్గరగా ఉన్నాయి. అమెరికాలో మరణాల సంఖ్య మూడు వేలకు వెళ్ళింది. జర్మనిలో కూడా కరోనా వైరస్ 66 వేల మందికి కరోనా వైరస్ సోకినట్టు ఆ దేశం పేర్కొంది. 

 

మన దేశం విషయానికి వస్తే కరోనా వైరస్ కేసుల సంఖ్య ఇప్పటి వరకు 1251 గా ఉంది. దాదాపు 40 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఇక వంద మంది వరకు కోలుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మంగళవారం ఒక్క రోజే 17 మందికి కరోనా వైరస్ సోకింది. దీనితో 40 మందికి కరోనా వైరస్ సోకింది. తెలంగాణాలో కూడా కరోనా వైరస్ కేసుల సంఖ్య 72 కి చేరుకుంది. మహారాష్ట్రలో 240 మందికి కరోన వైరస్ సోకింది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: