ప్రపంచమంతా కరోనా వైరస్  సమస్యతో  ఇబ్బందులు పడుతుంటే మాజీ మంత్రి, తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏడుపు మాత్రం ప్రత్యేకంగా ఉంది. అసలు లోకేష్ ఏడుపేంటో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఒకవైపు కరోనా వైరస్ నియంత్రణ విషయంలోను, బాధితలకు వైద్య సౌకర్యాలు అందించే విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నానా అవస్తలు పడుతోంది. ఇటువంటి సమయంలో కూడా లోకేష్ రైతుల పంటలకు రవాణా సౌకర్యాలు లేవని, పంటలకు గిట్టుబాటు ధరలు లేవని, హార్టీ కల్చర్, ఆక్వా రైతులు ఇబ్బందులు పడుతున్నారంటే ఒకటే ఏడుస్తున్నాడు.

రైతుల సంక్షేమానికి జగన్ చెప్పినవన్నీ మాయ మాటలే అన్నట్లుంది లోకేష్ ట్విట్టర్లో పెట్టిన కామెంట్లు చూస్తుంటే. రైతుల సమస్యల విషయంలో జగన్ ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటూ వ్యాఖ్యలు చేయటమే విచిత్రంగా ఉంది. తగిన సాయం అందకపోవటంతో రైతులు కన్నీళ్ళు పెట్టుకుంటున్నట్లు లోకేష్ కామెంట్ చేయటమే ఆశ్చర్యంగా ఉంది.

ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధానమైన సమస్య ఏమిటి ? ప్రజలు, ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాపించకుండా చేస్తున్న యుద్ధమేంటి అనే విషయంపై సరైన అవగాహన లేకపోవటంతోనే లోకేష్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. రవాణా సౌకర్యాలు లేకోవటంతో రైతులు అవస్తలు పడుతున్నారట. ఈ విషయం ప్రభుత్వానికి తెలీదా ? పంటలు అమ్ముకోవటానికి రైతులకు సౌకర్యాలు కల్పించకపోతే రాష్ట్రంలోని సుమారు 200 రైతు బజార్లకు కూరగాయలు, ఆకుకూరలు ఎలా అందుతున్నాయి ? ఇక గిట్టుబాటు ధరంటారా కాస్త ముందో వెనకో ప్రభుత్వమే కొంటుందని జగన్ ఇప్పటికే చెప్పాడు.

 

లోకేష్ చెప్పిన సమస్య ఏపిలోనే కాదు యావత్ దేశం మొత్తం ఉంది. ఆ విషయం మరచిపోయి ఏదో జగన్ పై ఆరోపణలు చేయాలి, విమర్శలు  చేయాలన్న పనికిమాలిన ఆలోచనే తప్ప మరోటి కనబడటం లేదు. ఇదే పరిస్ధితి తెలంగాణాలో కూడా ఉంది కదా ? అలాగే దేశమంతా ఇదే సమస్య ఉంది కదా ? మరి జగన్ పై చేసిన ఆరోపణలను నరేంద్రమోడి, కేసియార్ పైన ఎందుకు చేయటం లేదు ?  పైగా ఉండటం కూడా హైదరాబాద్ లోనే కదా ? జాతీయ కార్యదర్శి హోదాలో ఇదే ప్రశ్న కేసియార్ ను కూడా వేయచ్చు కదా ? అంత ధైర్యముందా ?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: