కరోనా వైరస్ మీద ఇపుడు దేశవ్యాప్తంగా పోరు సాగుతోంది. గత పది రోజులుగా దేశం తలుపులు మూసుకుంది. లాక్ డౌన్ పేరిట 130 కోట్ల మంది జనం ఇళ్ళలోనే  ఉంటున్నారు. పంటి బిగువున కష్టాన్ని అదిమిపట్టి మంచి రోజు కోసం ఎదురుచూస్తున్నారు.

 

ఓ వైపునా దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. వాటిని మధింపు చేసుకుంటూ కొత్త కేసులు పెద్దగా లేకుండా చూసుకునేందుకు పాలకులు తంటాలు  పడుతున్నాయి. లాక్ డౌన్ టైం లో కరోనా వ్యాప్తి పెద్దగా ఉండకపోతే అతి తక్కువ కేసులతో బయటపడతామని అంచనా వేసుకుంటున్నారు.

 

సరిగా ఈ సమయంలో ఢిల్లీలో జరిగిన ఓ మత ప్రార్ధనలో పెద్ద ఎత్తున వేలాది మంది గుమిగూడారన్న వార్తలు ఇపుడు కరోనా విషయంలో భయాందోళలను రెట్టింపు చేస్తున్నాయి. మార్చి 13 నుంచి 15 మధ్య మూడు రోజుల పాటు జరిగిన ఈ ప్రార్ధనలల్లో దేశం మొత్తం మీద వేలాదిగా ఒక మతానికి చెందిన వారు హాజరయ్యారని తెలుస్తోంది.

 

ఢిల్లీలోని నిజాముద్దీలో భారీ ఎత్తున మర్కజ్ ప్రార్థనలు జరిగినట్లుగా గుర్తించారు. దీనికి మొత్తం 75 దేశాల నుంచి ఎనిమిదివేల మంది వరకూ హాజరైనట్లుగా గుర్తించారు. ఇండోనేషియా.. మలేషియా.. సౌదీ.. కజకిస్థాన్ ఇలా చాలా దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఇలా హాజరైన విదేశీయుల సంఖ్య ఏకంగా రెండు వేలుగా చెబుతున్నారు.

 

ఇక ఈ మూడు రోజుల ప్రార్ధనల తరువాత అక్కడే బస చేసారని, అక్కడ ఆరు అంతస్తుల డార్మటరీల్లో 280 మంది విదేశీయులు ఉన్నట్లుగా తేలింది. అక్కడున్న మొత్తం 300 మందికి కొవిడ్ 19 లక్షణాలు ఉన్నట్లుగా గుర్తించారు. వీరిలో 175 మందికి పరీక్షలు నిర్వహించగా పలువురికి కరోనా లక్షణాలు ఉన్నట్లుగా తేలింది.  అనారోగ్యంగా ఉన్న 75 మందిని ఆదివారమే ఢిల్లీలో గుర్తించారు.

 

ఈ మొత్తం వ్యవహరాం ఒక్కసారిగా బయటపడడంతో ఒక్కసారిగా కరోనా  వైరస్ వ్యాప్తిపైన  లెక్కలు ఒక్కసారిగా  మారిపోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపుగా ఎనిమిది వందల మంది ఈ ప్రార్ధనలకు హాజరయ్యారని అంటున్నారు. అందులో ఆంధ్రా నుంచి 500 మంది ఉంటారని అంచనా.

 

దాంతో గత కొద్ది రోజులుగా పెద్దగా కనిపించని కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఒక్కరోజే ఏపీలో 17 దాకా పెరిగిపోయాయి. మరో వైపు తెలంగాణాలో ఆరుగురు కరోనా కటుకు బలి అయ్యారు. వీరంతా కూడా ఆ ప్రార్ధనల్లో పాలుపంచుకున్నవారేనని అంటున్నారు. మొత్తానికి ఇపుడు వేల మంది పాల్గొన్న ఈ ప్రార్ధనల్లో వారు ఇంటికి వెళ్ళి ఎవరెవరిని కలిశారన్న దాని మీద కూడా దేశమంతా పెద్ద ఎత్తున వాకబు చేస్తున్నారు. 

 

చూడాలి మరి, లాక్ డౌన్ వల్ల వ్యాప్తి తక్కువగా ఉంటే ఫరవాలేదు, లేకపోతే మాత్రం కరోనా వైరస్ వీర విహారం చేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: