ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ మతపరమైన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 500 మంది పాల్గొన్నట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత కొందరిలో కరోనా లక్షణాలు కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.  ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారితో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేగుతోంది. వీరితో కాంటాక్ట్ లో ఉన్న వారికి కరోనా లక్షణాలు వస్తుండటంతో యంత్రాంగం అప్రమత్తమైంది. తాజాగా ఏపీలో కరోనా వ్యాధిగ్రస్తుల సంఖ్య 40కి చేరుకుంది. 

 

ఈ నేపథ్యంలో గుంటగూరు జిల్లా కలెక్టర్ మ్యూల్ మాట్లాడుతూ, ఢిల్లీకి వెళ్లొచ్చిన 185 మందిలో 140 మందిని గుర్తించామని చెప్పారు. వీరిలో 103 మందికి పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్ వచ్చిందని తెలిపారు.  అక్కడ నుంచి వచ్చిన మిగతా నలభై మంది ఇంకా కనిపించడం లేదని.. వారు కరోనా వ్యాప్తి జరగకుండా బాధ్యతాయుతంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని ఆయన అన్నారు. 

 

కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని.. ఇది ప్రతి ఒక్క పౌరుడు తెలుసుకోవాలని అన్నారు.  మిగిలిన 40 మంది మా ముందుకు రాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఢిల్లీకి వెళ్లొచ్చిన వారు బయట తిరిగితే అరెస్ట్ చేస్తామని చెప్పారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: