ప్రపంచ దేశాల ప్రజలు అందరినీ వణికిస్తూ ఎంతోమంది ప్రాణ భయాన్ని కలిగిస్తున్న కరోనా  వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రపంచం మొత్తం సర్వ ప్రయత్నాలు చేస్తుంది . ఇప్పటికే ఈ వైరస్ 150  దేశాలకు పైగా వ్యాపించటంతో  ఆయా దేశాల మొత్తం తమ దేశం నుంచి కరోనా వైరస్ ను  తరిమి కొట్టేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే చాలా దేశాలు తమ దేశంలో లాక్ డౌన్ ప్రకటించాయి. ఇక ఈ మహమ్మారి వైరస్ భారతదేశంలో కూడా అడుగుపెట్టి రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో భారతదేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం కరోనా ను నియంత్రించే ప్రయత్నం లో భాగంగా లాక్ డౌన్  ప్రకటించిన విషయం తెలిసిందే. దేశ ప్రజలందరూ ఇల్లు దాటి బయటకు రాకుండా... ఎక్కడ సమూహాలుగా ఉండకుండా చేసి కరోనా  వైరస్ ను  నియంత్రించాలని భావించిన కేంద్ర ప్రభుత్వం ఏకంగా  21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించింది. అయితే ఏప్రిల్ 15 వరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ అక్కడితో ఆగిపోదు... ఇంకా చాలా రోజులపాటు కొనసాగే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 

 

 

 ఈ నేపధ్యంలో భారత ప్రజానీకం  కూడా అయోమయంలో పడిపోయింది. నిజంగానే ఏప్రిల్ 15 తర్వాత మరోసారి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్  ప్రకటిస్తుందా  అనే ప్రశ్న ప్రజల్లో మొదలైంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం... లాక్ డౌన్ ను  పొడిగిస్తారు అంటూ వస్తున్న వార్తలన్ని ఊహాగానాలు  మాత్రమే అంటూ స్పష్టం చేసింది. ఈ సమాచారాన్ని కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా  స్పష్టం చేశారు. ఇప్పటికైతే లాక్ డౌన్  పొడిగించే ఆలోచన లేదని ఒకవేళ పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామంటూ స్పష్టం చేశారు. 

 

 

 అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి క్లారిటీ వచ్చినప్పటికీ కూడా లాక్ డౌన్ పొడగిస్తారు అన్నదానిపై ప్రజల్లో అనుమానాలు మాత్రం పోవడం లేదు. అయితే దీనికి ఒక బలమైన కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఆర్బీఐ ఇప్పటికే మూడు నెలలపాటు ఈఎమ్ఐ లపై  మారటోరియం విధించడం... అంతేకాకుండా భారత ప్రజలు ఎవరు రెండు నెలల పాటు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు అంటూ  ప్రకటించడం... ఒక వేళ కేంద్ర ప్రభుత్వం కేవలం ఇరవై నాలుగు రోజులు మాత్రమే లాక్ డౌన్ కొనసాగించాలని  అనుకుంటే.. ఇలాంటి ప్రకటనలు ఎందుకు చేస్తుంది అనే అనుమానం ప్రజల్లో ఉన్నది . ఒకేసారి మూడు నెలల పాటు లాక్ డౌన్ ప్రకటిస్తే  ప్రజలు భయాందోళనకు గురి అయ్యే అవకాశం ఉంది కాబట్టి... మొదట 21 రోజులు లాక్ డౌన్ ప్రకటించి  ఆ తర్వాత దాన్ని పొడగించాలని  కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ మూడు నెలల పాటు ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు మూడు నెలల మారటోరియం సహా  కరెంటు బిల్లు కూడా కట్టాల్సిన అవసరం లేదు అని కేంద్ర ప్రకటన చేస్తున్నట్లు  కొందరు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: