భారతదేశంలో కరోనా వైరస్ కోరలు  చాస్తూ ఎంతో మందిని బలి తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు భారత దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ బారినపడి మృత్యువాత పడిన వారి సంఖ్య 30కి పైగా చేరింది. రోజురోజుకు కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ దేశ ప్రజలందరి లో ప్రాణభయం పట్టుకుంది. ప్రస్తుతం ప్రజలు ఏం చేయాలన్నా కరోనా  వైరస్ గుర్తొచ్చి భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో తమ తమ ప్రాణాలను కాపాడుకొని తమ వద్దకు కరోనా  దరి చేరకుండా ఉండేందుకు దేశ ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

 

 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలెవరూ సమూహాలుగా ఉండవద్దు అంటూ సూచిస్తున్న నేపథ్యంలో... ఢిల్లీలోని నిజాముద్దీన్ వద్ద మతపరమైన భారీ  ప్రార్థన సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా దీనిపై స్పందించిన తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా  వైరస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలెవరూ ఒకేచోట ఉండకూడదు అని  ప్రభుత్వాలు సూచిస్తుంటే ఢిల్లీలో భారీ ప్రార్థన సభ ఎలా నిర్వహిస్తారు అంటూ ప్రశ్నించారు. ఢిల్లీలో నిర్వహించిన ప్రార్థన సభకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే కాకుండా... దేశవ్యాప్తంగా మొత్తం ఆరు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు హాజరయ్యారు అంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. విదేశాల నుంచి కూడా చాలామంది ఈ ప్రార్థన సభకు వచ్చారు అని వెల్లడించారు. 

 

 

 మార్చి 13 వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య ఈ సభ జరిగింది అంటూ తెలిపిన ఎమ్మెల్యే రాజాసింగ్.. భారతదేశంలో కరోనా  వైరస్ ముప్పు ఉందని తెలిసి.... ప్రజల ఎవరు ఒకచోట గుమిగూడి  ఉండకుండా  కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతున్న క్రమంలో... ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో భారీ ప్రార్థన సభ నిర్వహించేందుకు అనుమతి ఎలా ఇస్తారు అంటూ ప్రశ్నించారు ఎమ్మెల్యే రాజాసింగ్. ఈ మేరకు ఓ వీడియోను కూడా విడుదల చేశారు రాజా సింగ్ .

 

 

 అయితే ప్రస్తుతం ఆ సభకు హాజరైన వ్యక్తుల్లో కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అవుతున్న నేపథ్యంలో ఆ సభకు హాజరైన చాలామందికి వైద్యులు వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఈ ప్రార్థన సభకు హాజరైన వారు కరోనా  వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకునేందుకు సహకరించడం లేదు అలాంటి వారిని కాల్చి పారేయాలి అంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. కరోనా  వైరస్ నిర్ధారణ పరీక్షలకు సహకరించని వారిని కాల్చేసి దేశాన్ని ఆంధ్రప్రదేశ్,  తెలంగాణను కాపాడుకోవాలి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది. కొంతమంది కారణంగా దేశ భవిష్యత్తును ప్రమాదంలో పెట్టలేము అంటూ రాజా సింగ్ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: